By: Arun Kumar Veera | Updated at : 27 Mar 2025 12:27 PM (IST)
మీ డబ్బులు పెరుగుతూనే ఉంటాయి ( Image Source : Other )
Special Fixed Deposits With High Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), రెపో రేట్ (Repo Rate)లో కోతలు షురూ చేసింది. రెపో రేట్ కోతలకు అనుగుణంగా బ్యాంక్ వడ్డీ రేట్లు కూడా తగ్గడం ప్రారంభమైంది. అంటే, గరిష్ట వడ్డీ అందుకునే రోజులు దాదాపుగా ముగిసినట్లే. అయితే, అత్యధిక వడ్డీ అందించే కొన్ని "స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్"లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. సాధారణ FDలతో పోలిస్తే ఇవి ఇంకొంచం ఎక్కువ వడ్డీ అందిస్తాయి. ముఖ్యంగా, సీనియర్ సిటిజన్లకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఈ నెలాఖరు వరకే, అంటే మార్చి 31, 2025 వరకే అందుబాటులో ఉంటాయి. మీరు ఎక్కువ వడ్డీ పొందాలనుకుంటే, ఈ స్కీమ్‌ల్లో డిపాజిట్ చేయవచ్చు.
ఎక్కువ వడ్డీ అందిస్తున్న స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు:
ఎస్‌బీఐ అమృత్ వృష్టి పథకం (SBI Amrit Vrishti Fixed Deposit Scheme)
స్టేట్ బ్యాంక్ అమలు చేస్తున్న అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు (60 ఏళ్ల వయస్సు లోపు వ్యక్తులు) 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు) 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ పథకం కాల వ్యవధి 444 రోజులు. ఈ స్కీమ్‌లో 2025 మార్చి 31 లోగా పెట్టుబడి పెట్టాలి.
ఎస్‌బీఐ అమృత కలశ్ పథకం (SBI Amrit Kalash Fixed Deposit Scheme)
స్టేట్ బ్యాంక్ అమలు చేస్తున్న అమృత కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం గడువు కూడా ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ స్కీమ్ కాల వ్యవధి 400 రోజులు. సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది.
ఐడీబీఐ ఉత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్ (IDBI Bank Utsav Callable FD Scheme)
ఈ స్కీమ్‌లో వివిధ కాల పరిమితులు ఉన్నాయి. ఈ స్కీమ్‌లో సూపర్ సీనియర్ సిటిజన్ (80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు)లకు కూడా స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి.
300 రోజులు - సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్ సిటిజన్లకు 7.55% వడ్డీ.
375 రోజులు - సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90% వడ్డీ.
444 రోజులు - సాధారణ ప్రజలకు 7.35%, సీనియర్ సిటిజన్లకు 7.85%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8% వడ్డీ.
555 రోజులు, 700 రోజుల టెన్యూర్స్‌లోనూ స్పెషల్ FDలు ఉన్నాయి.
555 రోజులు - సాధారణ ప్రజలకు 7.4%, సీనియర్ సిటిజన్లకు 7.90%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ.
ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు
ఇండ్ సుప్రీం 300 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ (IND Supreme 300 Days FD Scheme) - 300 రోజుల కాల వ్యవధి. సాధారణ ప్రజలకు 7.05%, సీనియర్ సిటిజన్లకు 7.55%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80% వడ్డీ.
ఇండ్ సూపర్ 400 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ (IND Super 400 Days FD Scheme) - 400 రోజుల కాల వ్యవధి. సాధారణ ప్రజలకు 7.30%, సీనియర్ సిటిజన్లకు 7.80%, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8.05% వడ్డీ.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ
35 నెలల కాల పరిమితితో HDFC Bank రన్ చేస్తున్న ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద సాధారణ ప్రజలకు 7.35%, సీనియర్ సిటిజన్లకు 7.85% వడ్డీ లభిస్తుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ
ఈ బ్యాంక్ కూడా వివిధ కాల వ్యవధులతో స్పెషల్ FD స్కీమ్‌లను అమలు చేస్తోంది. 555 డేస్ FD మీద 7.45% వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లు 7.95% వార్షిక వడ్డీ పొందొచ్చు.
రెపో రేట్ కోతల నేపథ్యంలో బ్యాంక్‌లు కూడా టర్మ్ డిపాజిట్లు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. కాబట్టి, మార్చి 31 తర్వాత ఈ స్కీమ్‌లను బ్యాంక్‌లు కొనసాగించకపోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
SBI ATM Transaction Fees:ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
Rahul Gandhi On Rohit Vemula Act: "రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Hyderabad News: హైదరాబాద్ కృష్ణానగర్‌లో పేలిన వాషింగ్ మెషిన్.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
PF Withdrawal By UPI: PF ఖాతాదారులకు శుభవార్త.. UPI యాప్స్ ద్వారా నగదు విత్‌డ్రాపై బిగ్ అప్డేట్