అన్వేషించండి

Gold Types: బంగారం పసుపు మాత్రమే కాదు నలుపు, గులాబీ రంగులో వస్తుంది! పసిడి ఎన్ని రకాలు? వాటి మధ్య తేడా ఏంటీ?

Gold Types: బంగారం కేవలం పసుపు రంగులో మాత్రమే కాదు, ఇది అనేక ఇతర రంగుల్లో కూడా వస్తుంది. బంగారం ఎన్ని రకాల్లో ఉంటుంది వాటి గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బంగారం అనేక రంగులలో లభిస్తుంది, లోహాలను కలపడం ద్వారా వస్తాయి.
  • పసుపు, గులాబీ, తెలుపు బంగారం ఇతర లోహాల మిశ్రమంతో తయారవుతాయి.
  • నలుపు, ఆకుపచ్చ, నీలి, ఊదా రంగు బంగారం ప్రత్యేక పద్ధతులతో రూపొందించబడతాయి.

Gold Types: మనం బంగారం గురించి ఆలోచించినప్పుడు, మన మైండ్‌లోకి పసుపు రంగులో ఉంటే  లోహం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ బంగారం వాస్తవానికి అనేక రంగుల్లో వస్తుంది: గులాబీ, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులో కూడా ఉంటుంది. ఈ రంగులు స్వచ్ఛమైన సహజ షేడ్స్ కావు; అవి బంగారాన్ని ఇతర లోహాలతో కలపడం ద్వారా లేదా దాని ఉపరితలాన్ని మార్చడం ద్వారా  తయారైనవే. దీని గురించి మరింత తెలుసుకుందాం.

పసుపు బంగారం సహజ బంగారానికి దగ్గరగా ఉంటుంది. స్వచ్ఛమైన బంగారాన్ని వెండి, రాగితో కలిపి డామినేటింగ్ ఎల్లో రంగుగా మారుస్తారు. ఇది చూడటానికి చూటముచ్చటగా మెరుస్తూ ఉంటుంది.  

గులాబీ బంగారం అని కూడా పిలువబడే పింక్ బంగారం రాగితో తయారు చేస్తారు. రాగి శాతం ఎక్కువగా ఉంటే, గులాబీ రంగు అంత డీప్‌గా ఉంటుంది. రాగి ఈ బంగారాన్ని పసుపు లేదా తెలుపు బంగారం కంటే స్ట్రాంగ్‌గా ఎక్కువ కాలం మన్నికగా చేస్తుంది.

తెల్ల బంగారాన్ని నికెల్, పల్లాడియం లేదా ప్లాటినం వంటి తెల్లని లోహాలతో కలపడం ద్వారా తయారు చేస్తారు. దాని మెరుపును పెంచడానికి సాధారణంగా రేడియంతో పూత పూస్తారు.

నల్ల బంగారం సహజంగా నల్లగా ఉండదు. ఎలక్ట్రోప్లేటింగ్, ఆక్సీకరణ లేదా రసాయన పేటినేషన్ వంటి చర్యల ద్వారా దాని మారుస్తుంటారు. నల్ల బంగారాన్ని తరచుగా డిజైనర్ నగలు, లగ్జరీ గడియారాలలో ఉపయోగిస్తారు.

ఆకుపచ్చ బంగారాన్ని వెండితో, కొన్నిసార్లు జింక్‌తో కలిపి తయారు చేస్తారు, దీని వలన బంగారానికి లేత ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ-పసుపు రంగు వస్తుంది. పురాతన ఆభరణాలలో ఆకుపచ్చ బంగారాన్ని ఉపయోగించారు.

నీలి బంగారం అనేది బంగారాన్ని ఇనుము లేదా గాలియం వంటి లోహాలతో కలపడం ద్వారా తయారు అవుతుంది. ఇది నీలి రంగును ఉత్పత్తి చేస్తుంది. కానీ లోహాన్ని చాలా పెళుసుగా చేస్తుంది. అల్యూమినియంతో కలపడం ద్వారా తయారైన ఒక రకమైన ఊదా బంగారం కూడా ఉంది.

Frequently Asked Questions

బంగారం ఏయే రంగుల్లో లభిస్తుంది?

బంగారం పసుపు, గులాబీ, తెలుపు, నలుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులలో లభిస్తుంది. ఈ రంగులు ఇతర లోహాలతో కలపడం ద్వారా లేదా ఉపరితలాన్ని మార్చడం ద్వారా తయారవుతాయి.

గులాబీ బంగారం ఎలా తయారవుతుంది?

గులాబీ బంగారం రాగితో తయారు చేయబడుతుంది. రాగి శాతం ఎక్కువగా ఉంటే, గులాబీ రంగు మరింత గాఢంగా ఉంటుంది. ఇది పసుపు లేదా తెలుపు బంగారం కంటే బలంగా, ఎక్కువ కాలం మన్నుతుంది.

తెల్ల బంగారం తయారీకి ఏ లోహాలు వాడతారు?

తెల్ల బంగారాన్ని నికెల్, పల్లాడియం లేదా ప్లాటినం వంటి తెల్లని లోహాలతో కలిపి తయారు చేస్తారు. దాని మెరుపును పెంచడానికి సాధారణంగా రేడియంతో పూత పూస్తారు.

నల్ల బంగారం ఎలా తయారవుతుంది?

నల్ల బంగారం సహజంగా నల్లగా ఉండదు. ఎలక్ట్రోప్లేటింగ్, ఆక్సీకరణ లేదా రసాయన పేటినేషన్ వంటి ప్రక్రియల ద్వారా దాని రంగును మారుస్తారు. ఇది తరచుగా డిజైనర్ నగలు, లగ్జరీ గడియారాలలో ఉపయోగిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget