అన్వేషించండి

ChatGPT: ఛాట్‌జీపీటీలో కొత్త 'ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌' - రెస్పాన్స్‌ అద్భుతం

Image Generation Feature In ChatGPT: ఛాట్‌జీపీటీలో ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌ను తీసుకొస్తూ OpenAI కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసింది. యూజర్లు దీనిని ఇష్టపడుతున్నారు, విభిన్న చిత్రాలు సృష్టిస్తున్నారు.

Image Generation Feature Launched In ChatGPT: ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ, తన కృత్రిమ మేథ చాట్‌బాట్ (AI Chatbot) ChatGPTని అప్‌డేట్‌ చేసింది. అధునాతన "ఇమేజ్ జనరేషన్" సామర్థ్యాలను అందించే GPT-4oని ఛాట్‌జీపీకి అనుసంధానించింది. ChatGPT, ప్రస్తుతం, DALL-E మోడల్ సాయంతో చిత్రాలు సృష్టిస్తోంది. ఇకపై, అప్‌డేటెడ్‌ వెర్షన్‌తో & GPT-4o సాయంతో చిత్రాలు సృష్టిస్తుంది. ఈ ఫీచర్‌ను “Images in ChatGPT” అని పిలుస్తున్నారు. యూజర్ల నుంచి దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

న్యూ మోడల్‌ను ఎందుకు తీసుకొచ్చింది?
చిత్రాల రూపకల్పన (Image Generation)ను మెరుగుపరచడానికి కంపెనీ DALL-E 3ని GPT-4oతో రీప్లేస్‌ చేసింది. మరింత మెరుగ్గా & నిజమైన ఫొటోలు అనిపించేలా చిత్రాలను రూపొందించడానికి GPT-4oను లాంచ్‌ చేసినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇది, చిత్రాల రూపకల్పనకు DALL-E 3 కంటే కాస్త కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుందని & ఖచ్చితమైన, వివరణాత్మక చిత్రాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించింది. 

నూతన అప్‌డేట్‌తో ChatGPT కొత్త చిత్రాలను సృష్టించడమే కాకుండా, పాత చిత్రాలను సవరించగలదు & మార్చగలదు. ఇది, ఫొటోల ముందు భాగం ‍‌(foreground), నేపథ్యం (background)ను సవరించగలదు. ఓపెన్‌ఏఐ కంపెనీ, ఈ మోడల్‌కు షట్టర్‌స్టాక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంతో, ప్రజలకు అందుబాటులో ఉన్న డేటాతో శిక్షణ ఇచ్చింది. 

ఎవరికి అందుబాటులో ఉంది?
ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ తీసుకొచ్చామని OpenAI CEO శామ్‌ఆల్ట్‌మన్‌ (Sam Altman) ‘ఎక్స్’లో ప్రకటించారు. ఈ ఫీచర్‌ను త్వరలో చాట్‌జీపీటీ ప్లస్‌ (ChatGPT Plus), చాట్‌జీపీటీ ప్రో (ChatGPT Pro), చాట్‌జీపీటీ టీమ్‌ (ChatGPT Team)తో పాటు సాధారణ వినియోగదార్లకు కూడా "ఉచితం"గా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. డెవలపర్లు API ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ కోసం ఫ్రీ యూజర్లు కాస్త ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి రావచ్చు. 

ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌తో సృష్టించిన & సవరించబడిన ఫోటోలను కొందరు యూజర్లు Xలో పంచుకున్నారు.

రెస్పాన్స్‌ అద్భుతం 
తాము ఊహించినదాని కంటే ఎక్కువగా యూజర్లు ఈ అప్‌డేటెడ్‌ మోడల్‌ను ఇష్టపడుతున్నారని OpenAI ప్రకటించింది. ఉచిత వినియోగదారుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టవచ్చని కూడా చెప్పారు. అయితే, ఎప్పటిలోగా అందరికీ అందుబాటులోకి తెస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. దీనిలో ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయని, ఆ సవాళ్లను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget