KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
KTR Latest News: కక్ష సాధింపు చర్యలకు దిగితే ఫ్యామిలీ అంతా జైల్లో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్.

KTR Latest News: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆఖరి రోజు హీట్ డిస్కషన్స్ జరిగాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సంవాదం నడిచింది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సాగాయి. కుటుంబ వ్యవహారాలు, సోషల్ మీడియా వేదికగా జరుగుతన్న విమర్శలు, అక్రమ కేసుల అంశం ఇలా చాలా అంశాలపై ఇద్దరి మధ్య చర్చ నడిచింది.
బడ్జెట్ డిస్కషన్ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను నిజంగానే కక్ష సాధింపు చర్యలు దిగితే ఆ ఫ్యామిలీ(కేసీఆర్ ఫ్యామిలీ) మొత్తం జైల్లో ఉంటుందని అన్నారు. అలాంటి ఆలోచన తనకు లేదని వెల్లడించారు. ఎక్కడో ప్రైవేటు భవంతులపై డ్రోన్ ఎగరేశానని జైల్లో పెట్టిన సంస్కృతి బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది అని విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ కూడా ఘాటైన సమాధానం ఇచ్చారు. " ముఖ్యమంత్రికి ప్రస్ట్రేషన్ పనికిరాదు. అక్కడ కూర్చాంటా కూర్చుంటా అని 2009 నుంచి చెబుతున్నాడు. కూర్చున్న తర్వాత కూల్ కావాలి కదా. ఇప్పుడు ఎందుకింత ప్రస్ట్రేషన్, నిస్ప్రహా, ఎందుకింత ఆవేశమో మాకు అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రిలో ఒక అపరిచతుడు ఉన్నాడు. మొన్న రవీంద్రభారతిలో మాట్లాడుతూ... మమల్ని ఎవడూ నమ్ముతలేడు అని అప్పు పుట్టడం లేదని బయట చెబుతున్నాడు. ఇక్కడకు వచ్చేమో లక్షా 80 వేల కోట్ల అప్పు చేశానని రొమ్ము విరుచుకొని చెబుతున్నాడు. ఎవరు కరెక్టో మాకు అర్థం కావడం లేదు. " అని విమర్శించారు.
ముఖ్యమంత్రి ఓవైపు పెట్టుబడులు వస్తున్నాయని చెబుతూనే మరోవైపు ఆదాయం తగ్గిందని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎందుకు చెప్పారని ప్రశ్నించారు కేటీఆర్. ఓ దిక్కు సంక్షేమానికి పైసల్ లేవు అని చెబుతూనే మరోవైపు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, వివిధ పనులకు టెండర్లు పిలుస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. వీటికి పైసలు ఉన్నాయని కానీ పేదలకు ఇవ్వాల్సిన హామీలు అమలు చేయడానికి పైసల్ లేవా అని ప్రశ్నించారు.
రుణమాఫీపై కేటీఆర్ సవాల్
రుణమాఫీపై పదే పదే చెప్పే ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాల్ చేశారు. కొడంగల్, సిరిసిల్లలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలు వంద శాతం రుణమాపీ అయినట్టు చెబితే శాశ్వతంగా రాజకీయాలు వదేలేస్తానని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లెకు అయినా వెళ్దామన్నారు. వాళ్లే ఎన్నికల టైంలో ప్రజలను రెచ్చగొట్టి రెండు లక్షలు రుణాలు తీసుకోమన్నారని తెలిపారు.
రైతు బంధు పథకం నిధులు ఇవ్వకుండా ఆపింది రేవంత్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి లెటర్ రాసి కాపీ కూడా తమ వద్ద ఉందని వెల్లడించారు కేటీఆర్. డిసెంబర్ ఏడు లోపు అయితే ఐదు వేలు ఇస్తారని... డిసెంబర్ 7 తర్వాత ఏడు వేలు తీసుకోవచ్చని ప్రచారం చేశారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కరెంటు విధానాలపై విమర్శలు చేసింది ఇదే రేవంత్ రెడ్డి అని వెల్లడించారు.
వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టు పెట్టారని, ప్రజలను మభ్యపెట్టారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ బంగారం అనుకొని ప్రజలు ఓటు వేశారని ఇప్పుడు అది రోల్డ్ గోల్డ్ అని తేలిందని ఎద్దేవా చేశారు. రైతులకు బోనస్ అని చెప్పి ఓ పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారని ఒక్కదానికైనా బోనస్ ఇచ్చారా అని నిలదీశారు.
జైలుకు వెళ్లిన అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆయన(రేవంత్ రెడ్డి ) ఏమైనా స్వతంత్ర్య ఉద్యమం చేసి జైలుకు పోయాడా?, మేం కూడా జైలుకు వెళ్లాం. ఉద్యమం టైంలో జైలుకు వెళ్లాం. మీరు ఎందుకు వెళ్లారు. మీ ఇంటి మీదికి ప్రైవేటు వ్యక్తులు డ్రోన్స్ పంపిస్తే ఊరుకుంటారా? అక్కడ నీ బిడ్డో, భార్యో ఉంటే వాళ్లను ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీస్తే ఊరుకుంటవా? ఎవరింట్లో అయిన చొరబడతా, ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊరుకుంటారా? మీకాడికి వచ్చేసరికి కుటుంబాలు, మీ వరకు వచ్చే వరకే భార్య పిల్లలు. వేరే వాళ్లకు ఉండరా? ఆనాడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు, ఆరోజు లేవా నీతులు. మా ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా తిట్టిపోశారు." అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించింది తాము కాదని... కోర్టులని తెలిపారు కేటీఆర్. నాకు రిమాండ్ విధించవద్దని కోర్టుకు విన్న వించుకుంటే దాన్ని న్యాయస్థానాలు తిరస్కరించాయన్నారు. ముఖ్యమంత్రి ఎంత హూంకరించినా ఫరఖ్‌పడదని అన్నారు. అనుకున్నంత మాత్రాన ఏం జరిగిపోదని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారులు ఉండవని అన్నీ న్యాయపరిధిలో ఉంటాయని గుర్తు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

