అన్వేషించండి

Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం

Relief for Sonam Wangchuk:లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ పై మోపిన జాతీయ భద్రతా చట్టం ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఆయన ఆరు నెలల నిర్బంధం తర్వాత విడుదల కానున్నారు.

Centre Revokes Detention Of Sonam Wangchuk:   లడఖ్‌కు స్వయంప్రతిపత్తి , రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్‌పై మోపిన జాతీయ భద్రతా చట్టం  ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉపసంహరించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో లేహ్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారిన సమయంలో, ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో వాంగ్చుక్‌ను అరెస్టే చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. దాదాపు ఆరు నెలల నిర్బంధం తర్వాత ఆయనపై జాతీయ భద్రతా చట్టంను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.                                    

లడఖ్‌లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి,  ఆ ప్రాంతంలోని స్టేక్‌హోల్డర్లతో అర్థవంతమైన చర్చలు జరపడానికి ఈ నిర్బంధాన్ని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత కొంతకాలంగా లడఖ్‌లో నిరసనలు, బంద్‌ల వల్ల విద్యార్థులు, వ్యాపారులు,  పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోతున్నాయని, సాధారణ స్థితిని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని హోం శాఖ స్పష్టం చేసింది. వాంగ్చుక్ ఇప్పటికే తన శిక్షా కాలంలో సగానికి పైగా పూర్తి చేశారని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయనను విడుదల చేయడం సముచితమని ప్రభుత్వం భావించింది.

వాంగ్చుక్ అరెస్టును సవాలు చేస్తూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు కోర్టులో వాదనలు వినిపిస్తూ, వాంగ్చుక్ యువతను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని, నేపాల్, బంగ్లాదేశ్ తరహా ఆందోళనలకు పిలుపునిచ్చారని ప్రభుత్వం వాదించింది. అయితే, తాను ఎప్పుడూ హింసను ప్రేరేపించలేదని, హింస వల్ల లడఖ్ ఐదేళ్ల ప్రశాంతమైన పోరాటం  వృథా అవుతుందని తాను గతంలోనే స్పష్టం చేశానని వాంగ్చుక్ తరఫు న్యాయవాదులు వాదించారు.        

ప్రభుత్వ నిర్ణయాన్ని కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ వంటి సంస్థలు స్వాగతించినప్పటికీ, లడఖ్ ప్రజల ప్రధాన డిమాండ్లు ఇంకా నెరవేరలేదని పేర్కొన్నాయి. రాష్ట్ర హోదా,  ఆరో షెడ్యూల్ అమలు కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. వాంగ్చుక్ విడుదల తర్వాత లడఖ్ పరిపాలనలో, కేంద్ర ప్రభుత్వంతో జరిపే చర్చల్లో ఎలాంటి మార్పులు వస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.                                                            

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget