అన్వేషించండి

Hyderabad Crime News:మేడ్చల్‌ జిల్లాలో అమానుషం! పెళ్లికి నిరాకరించిందని యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చిన ఉన్మాది!

Hyderabad Crime News: తనతో పెళ్లికి నిరాకరించి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంటుందన్న కక్షతో యువతికి HIV ఇంజెక్షన్ ఇచ్చి జీవితాన్ని నాశనం చేశాడో శాడిస్టు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెళ్లికి నిరాకరించిన మరదలిపై ప్రేమించిన యువకుడు పగ పెంచుకున్నాడు.
  • HIV ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు.
  • ఆరోగ్య పరీక్షల్లో HIV పాజిటివ్ రావడంతో ఘోరం బయటపడింది.
  • నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Crime News: ప్రేమ ఉన్మాదంగా మారితే ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని చెప్పడానికి మేడ్చల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘటనే నిదర్శనం. సినిమా కథలను తలపించేలా అంతకంటే క్రూరంగా ఒక యువకుడు తన మరదలిపై పగ తీర్చుకున్నాడు. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఆమె జీవితాన్ని అంధకారం చేయాలనే దురుద్దేశంతో తనకు ఉన్న ఎయిడ్స్‌ వ్యాధిని అమెకు కూడా అంటించాడు. బలవంతంగా HIV సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి ఈ అమానుష ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

ప్రేమ పేరిట కక్ష

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, మేడ్చల్‌ జిల్లా అన్నోజి గూడకు చెందిన మనోహర్ అనే యువకుడు తన మరదలిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించినప్పటికీ యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెకు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. తన మేన మరదలు తనకు కాకుండా మరో వ్యక్తికి భార్య కాబోతుందన్న  నిజాన్ని మనోహర్‌ జీర్ణించుకోలేకపోయాడు. ఈ అసూయ, కోపం క్రమంగా ఆమెపై పగగా మారింది. ఆమె జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా భయంకరమైన కుట్రకు తెరలేపాడు. 

రాజు వెడ్స్ రాంబాయి సినిమా స్ఫూర్తితో ఘాతుకం

ఈ క్రూరమైన పగ తీర్చుకోవడానికి మనోహర్ ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి అనే తెలుగు సినిమాను ప్రేరణగా తీసుకున్నాడు. ఆ సినిమాలో చూపిన విధంగానే తనకు ఉన్న HIV వ్యాధిని ఆ యువతికి అంటించాలని నిర్ణయించుకున్నాడు. యువతి ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో ఆమె ఇంటికి వెళ్లి సైలెంట్‌గా HIV ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ రూపంలో ఆమె శరీరంలోకి ఎక్కించాడు.  

బయటపడ్డ భయంకర నిజం 

ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత సదరు యువతి తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురైంది. సాధారణ జ్వరమే అని భావించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అయితే వచ్చిన రిపోర్టులను చూసిన వైద్యులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. పెళ్లి సిద్ధమవుతున్న ఆ యువతికి HIV పాజిటవ్‌ అని నిర్దారణ అయ్యింది. ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తెకు ఈ వ్యాధి ఎలా సోకిందని ఆరా తీయగా మనోహర్ చేసిన దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. మనోహర్‌ ఉద్దేశపూర్వకంగానే తన రక్తాన్ని ఆణెకు ఎక్కించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరుమున్నీరు అవుతున్నారు. 

నిందితుడు అరెస్టు 

బాధిత యువతి, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడ్చల్‌ జిల్లా పోచారం పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు మనోహర్‌్ను అదుపులోకి తీసుకుని విచారించగా, పగతోనే ఈ పని చేసినట్టు తేలింది. పోలీసులు అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక యువతి భవిష్యత్, ఆమె వైవాహిక జీవితాన్ని అత్యంత క్రూరంగా దెబ్బతీసిన నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని స్థానికులు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Frequently Asked Questions

మనోహర్ తన మరదలికి HIV ఎలా సోకించాడు?

పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో, మనోహర్ తన వద్ద ఉన్న HIV సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా మరదలి శరీరంలోకి ఎక్కించాడు.

ఈ ఘోరానికి కారణం ఏమిటి?

మనోహర్ తన మరదలిని ప్రేమించాడు, కానీ ఆమె కుటుంబం వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేయడంతో, పగ తీర్చుకోవడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.

ఆ యువతికి HIV సోకిందని ఎలా తెలిసింది?

యువతి తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల్లో ఆమెకు HIV పాజిటివ్ అని తేలింది.

నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

పోలీసులు నిందితుడు మనోహర్‎ను అదుపులోకి తీసుకుని, అతనిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi on Women Reservations: మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
మహిళా రిజర్వేషన్ల అమలు చారిత్రక ఘట్టం, 2029 ఎన్నికల నుంచే వర్తింపు: ప్రధాని మోదీ
Pocharam Srinivas Reddy: నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా? చావైనా బతుకైనా సరే తేల్చుకుంటా: పోచారం శ్రీనివాస్ రెడ్డి
Donald Trump on Pope Leo: పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అణ్వాయుధాలను వ్యతిరేకించరు.. ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
పోప్‌ లియోకు క్రైమ్స్ అంటే చాలా ఇష్టం! అందుకే ఆయన నాకు నచ్చలేదు: డొనాల్డ్ ట్రంప్
Nashik Corporate Jihad: మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
మహరాష్ట్రను కుదిపేస్తున్న నాసిక్ 'కార్పోరేట్ జిహాద్'- తెలంగాణకు  బీజేపీ సూచనలు
This Week Theatrical Releases : హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
హాట్ సమ్మర్‌లో చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్ ఇవే!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
AP Cabinet Reshuffle: మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వెనుక కేబినెట్ మార్పు చేర్పుల సమీకరణాలు - కసరత్తు పూర్తి చేశారా?
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Embed widget