మీ జీవితంలో కష్టం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా!
కురుక్షేత్ర సంగ్రామంలో దిగేందుకు వెనకడుగు వేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధ భగవద్గీత
యుద్ద వ్యూహాలు, అస్త్ర శస్త్రాల గురించి కాదు..మనిషి ప్రవర్తన, ఆలోచనా విధానం సహా ఓ మంచిమనిషిగా ఎలా ఉండాలో చెప్పాడు
చాలా బాధగా ఉన్నప్పుడు, అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు ఈ రెండు సందర్భాల్లో నిర్ణయం తీసుకోకూడదు..
బాధలో తీసుకున్న నిర్ణయం సరైన ఆలోచనను చంపేస్తుంది.. సంతోషంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని చెడువైపు నడిపిస్తుంది
ఏ కారణం లేకుండా ఎవరి జీవితంలోనూ సమస్యలురావు..సమస్య వచ్చిందంటే మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలని అర్థం
మీ జీవితంలో సంతోషం నింపినవారిని మోసం చేయవద్దు..ఓసారి మిమ్మల్ని మోసం చేసినవారికి మరో అవకాశం ఇవ్వరాదు
కేవలం ప్రదర్శన కోసం మంచిగా ఉన్నట్టు నటించాల్సిన అవసరం లేదు..ఎవరు గమనించినా లేకున్నా మీరు మీరుగానే ఉండాలి
ఓటమి, గెలుపు అనేది మీ ఆలోచనపై ఆధారపడి ఉంటాయి.. అంగీకరిస్తే ఓటమి అవుతుంది.. సోపానంగా మార్చుకుంటే విజయం వరిస్తుంది
అన్నిటికీ కారణం మీ ఆలోచనా విధానమే అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు ....