Maha Kumbh Mela 2025 Indian Railways: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
Special Trains For Kumbh Mela 2025: మహా కుంభమేళాకి హాజరయ్యే భక్తులకోసం ఇండియన్ రైల్వే ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తోందనే ప్రచారం జరుగుతోంది..ఇందులో నిజమెంత? రైల్వే అధికారులు ఏమన్నారు?

Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళాకి దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యటకులు హాజరయ్యే అవకాశం ఉందన్నది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అంచనా. ఈ మేరకు స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌లో 3లక్షలకు పైగా మొక్కలు నాటామని... కుంభమేళా పూర్తైన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని చెప్పారు ఉత్తర ప్రదేశ్ జల్‌శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆధ్యాత్మిక సంబరానికి భారీగా నిధులు కేటాయించింది.
అతి పెద్ద ఆధ్యాత్మిక సంబంరంగా చెప్పే మహా కుంభమేళాకు కొన్ని నెలల ముందునుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయ్. జనవరి 13 భోగి నుంచి ఫిబ్రవరి 26 మహా శివరాత్రి వరకూ మహాకుంభమేళా జరగనుంది. ప్రయాగరాజ్ లో జనవరి 14న మహా కుంభమేళా నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక సంబరంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు.
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు హాజరుకానున్న కోట్లాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 13 వేల రైళ్లు కేవలం కుంభమేళాకి కేటాయించింది. భక్తులకు సుమార్ 15 భాషల్లో అనౌన్సమెంట్ ఇచ్చేలా ప్రయాగ రాజ్ లో అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
మహాకుంభమేళాకు రైలేశాఖ ఉచిత రైలు ప్రయాణం ఏర్పాటు చేసిందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో మాత్రమే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ దీనిపై వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై స్పందించిన రైల్వేశాఖ... ఇదంతా అవాస్తవం అని స్పష్టం చేసేసింది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాకుంభమేళా మాత్రమే కాదు ఏ ఇతర సందర్భాల్లోనూ ఉచిత రైలు ప్రయాణానికి అనుమతి ఉండదని మరోసారి ఇలాంటి ప్రచారం జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టేశారు రైల్వే శాఖాధికారులు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు, పర్యాటకుల కోసం అదనపు టికెట్ కౌంటర్లు, ప్రయాణికులు - పర్యాటకులు-భక్తులకు అవసమరైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని రైల్వేశాఖ స్పష్టం చేసింది. మహా కుంభమేళా సందర్భంగా నడిచే రైళ్ల విషయంలో రైల్వేశాఖ కీలక జాగ్రత్తలు తీసుకుంది. ఈ రైళ్లకు రెండు ఇంజిన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు..తద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.. ఈ మేరకు ప్రయాగ్ రాజ్ లో రైల్వే సంస్థ చేస్తున్న ఏర్పాట్లను కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిశీలించారు.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!






















