12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!
Vibhishana: రామాయణం గురించి కాస్త అవగాహన ఉన్నాసరే విభీషణుడు ఎవరో ఠక్కున చెప్పేస్తారు. రావణుడి సోదరుడు..రాముడి భక్తుడు. ఇప్పటికీ బతికే ఉన్న విభీషణుడు 12 ఏళ్లకు ఓసారి ఓ ఆలయానికి వస్తాడని మీకు తెలుసా..
Vibhishana goes to Srirangam every 12 years to worship the Lord: ఈ మధ్య సినిమాల పుణ్యమా అని సప్త చిరంజీవుల గురించి అందరకీ తెలుస్తోంది. చిరంజీవులు అంటే మరణం లేనివారు అని అర్థం. ఇలాంటి వారు భూమ్మీద ఏడుగురున్నారు.
(సప్త చిరంజీవులు అంటే ఎవరో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
వారిలో హనుమంతుడు ఒకడని హిమాలయాల్లో కనిపించాడని వింటూనే ఉన్నారు. ఆ మధ్య ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీలో విభీషణుడి క్యారెక్టర్ ఉంటుంది. దీంతో విభీషణుడు కూడా సప్తచిరంజీవుల్లో ఒకడు అని తెలుసుకున్నారంతా. ఆ తర్వాత వచ్చిన కల్కి 2898 ADలో అశ్వత్థామ క్యారెక్టర్ ఉండడంతో... సప్త చిరంజీవుల జాబితాలో ఉన్నాడని తెలియడంతో పాటూ మహాభారతంలో అశ్వత్థామ పాత్ర గురించి క్లారిటీ వచ్చింది. అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఓ శివాలయంలో నిత్యం పూజలు చేస్తాడనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి..
(అశ్వత్థామ గురించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి).
అశ్వత్థామ ఓ శివాలయంలో పూజలు చేస్తున్నట్టే.. విభీషణుడు కూడా 12 ఏళ్లకోసారి ఓ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని కళ్లారా దర్శించుకుని వెళతాడని ప్రచారంలో ఉన్న కథనం. ఆ ఆలయమే తమిళనాడులో ఉన్న శ్రీరంగం...
శ్రీ రంగనాథుడిని మొదట బ్రహ్మదేవుడు ఆరాధించాడు..ఆ తర్వాత రఘువంశానికి చెందిన మహారాజు ఇక్ష్వాకుకి ఇచ్చాడు. ఆయన రంగనాథుడిని అయోధ్యకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశాడు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు శ్రీరామచంద్రుడితో పాటూ విభీషణుడు కూడా వచ్చాడు. ఆ సమయంలో తిరిగి వెళుతూ..తన రాజధానిలో నిన్ను ఆరాధించుకునే భాగ్యం కల్పించమని అడిగాడు. అప్పుడు శ్రీ రామచంద్రుడు రంగనాథుడి విగ్రహాన్ని ఇచ్చి పంపించాడు. సంధ్యా సమయం కావాడంతో స్వామిని కావేరి నదుల మధ్య ప్రాంతంలో ఉంచి కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేసరికి రంగనాథుడు ప్రణవాకార, విమాన రూపంలో కనిపించాడు. అప్పటి నుంచీ అక్కడే కొలువయ్యాడు రంగనాథుడు..అదే శ్రీరంగం క్షేత్రం.అయితే అన్ని దేవతా మూర్తుల విగ్రహాల్లో తూర్పు, ఉత్తర ముఖంగా కాకుండా..రంగనాథుడు విభీషణుడి రాజ్యాన్ని చూస్తున్నట్టు దక్షిణ ముఖంగా చూస్తూ కొలువుతీరాడు. 12 ఏళ్లకు ఓసారి విభీషణుడు స్వయంగా వచ్చి రంగనాథుడిని ఆరాధిస్తాడని చెబుతారు.
Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!
రంగనాథుడి ఆలయానికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఏళ్ల క్రితం ఇది రామానుజాచార్యుల ప్రధాన కార్యాలయం. ఈ ఆలయంలోనే రామానుజులు 120 ఏళ్ల వయసులో సమాధిలోకి ప్రవేశించారు...ఆ మందిరం కూడా ఇక్కడ చూడొచ్చు. 1326లో మాలిక్ కాఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లింల దాడిలో వందలమంది శ్రీ వైష్ణవులు మరణించారని, గర్భగుడిలో భగవంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని చెబుతారు. అలాంటి సమయంలో ప్రధాన దేవత విగ్రహాన్ని గోడవెనుక దాచేసి ఓ సాధారణ విగ్రహాన్ని అక్కడుంచగా ముస్లింలు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారట. ఈ ఆలయంలో జగన్నాథ, బలదేవ, సుభద్ర కొలువైన ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఉపాలయాలున్నాయి.