Vishwambhara First Single: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది, ఎప్పుడో తెలుసా?
Vishwambhara: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు 'విశ్వంభర' మూవీ టీం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఈ నెల 12 సినిమా నుంచి 'రామ రామ' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

Megastar Chiranjeevi's Vishwambhara First Single Release Date Unvieled: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫ్యాన్స్‌కు ఇది నిజంగా అదిరిపోయే న్యూస్. ఆయన హీరోగా 'బింబిసార' మూవీ ఫేం మల్లిడి వశిష్ట (Mallidi Vassishta) దర్శకత్వంలో వస్తోన్న అవెయిటెడ్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'విశ్వంభర' (Vishwambhara) నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 12న వచ్చేస్తోంది
ఈ నెల 12న 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ 'రామ రామ' వచ్చేస్తోంది అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ పంచుకున్నారు. 'హనుమంతునికి తన ప్రభువు శ్రీరాముడి పట్ల ఉన్న ప్రేమ, గౌరవం.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించారు. శ్రీరాముని విగ్రహం బ్యాక్ గ్రౌండ్‌లో బాల హనుమాన్‌ను మెగాస్టార్ ఎత్తుకోగా.. చుట్టూ హనుమంతుల వేషాల్లో చిన్నారులు ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
A Hanuman's love and reverence for his Lord Shri Ram 🏹✨#Vishwambhara First Single #RamaRaama out on April 12th ❤️🔥
— UV Creations (@UV_Creations) April 10, 2025
Music by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by 'Saraswatiputra' @ramjowrites ✒️
MEGA MASS BEYOND UNIVERSE.
MEGASTAR @KChiruTweets @trishtrashers… pic.twitter.com/obH0onoxhN
Also Read: ఓటీటీలోకి వచ్చేస్తోన్న వీరుడి కథ - 'ఛావా' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
హనుమాన్ విగ్రహం దగ్గరే సాంగ్ రిలీజ్
ఈ మూవీ సాంగ్ రిలీజ్ విషయంలో మేకర్స్ మెగా సెంటిమెంట్ అప్లై చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నందిగామలోని ఓ ప్రముఖ దేవాలయంలో హనుమాన్ విగ్రహం దగ్గర ఈ 'రామ రామ' పాట రిలీజ్ చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాలో కూడా హనుమాన్ విగ్రహం దగ్గర కీలక సీన్స్ షూట్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపించింది. అయితే, దీనిపైనా క్లారిటీ లేదు. ఆ తర్వాత సినిమా విడుదల తేదీపై అనేక రూమర్స్ వినిపించాయి. మేలో మూవీ రిలీజ్ చేయాలని భావించినా.. గ్రాఫిక్ వర్క్స్ ఇంకా పూర్తి కాలేదని.. అప్పుడు కూడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్‌పై మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక తాజా టాక్ ప్రకారం.. మెగాస్టార్ బర్త్ డే రోజున ఆగస్ట్ 22న 'విశ్వంభర' మూవీని ఫ్యాన్స్‌కు కానుకగా థియేటర్లలోకి రిలీజ్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. అయితే, రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తుండగా.. చిరంజీవి సరసన చాలా రోజుల తర్వాత త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమెతో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ వంటి ఐదుగురు యంగ్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

