'పున్నమి నాగు' సినిమాలో ఒళ్ళంతా విషపూరితమైన యువకుడి పాత్రలో కనిపించారు చిరంజీవి. ఇది ఆయనకు మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తెచ్చిపెట్టింది.

'చంటబ్బాయ్' సినిమాలో చిరంజీవి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటించారు. ఓ సన్నివేశం కోసం చిరు మీసాలు తీసేయడమే కాదు, లేడీ గెటప్ వేశారు.

'జేబుదొంగ' చిత్రంలో ఓ సీన్ లో ఒంటి మీద బట్టలన్నీ తీసేసి అర్థనగ్నంగా నటించడానికి ఏమాత్రం వెనకాడలేదు.

మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరు.. 'స్వయంకృషి' సినిమా కోసం తన స్టార్ డమ్ ని పక్కనపెట్టి చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించారు.

చిరు నటించిన రివిజనిస్ట్ వెస్ట్రన్ యాక్షన్ మూవీ 'కొదమ సింహం'. ఇందులో కౌబాయ్ గా కనిపించి ఆకట్టుకున్నారు.

మాస్ ఇమేజ్ ని పక్కనపెట్టి 'ఆపద్భాంధవుడు' 'రుద్రవీణ' వంటి క్లాస్ మూవీస్ లో నటించడం చిరుకే చెల్లింది.

'జెంటిల్ మేన్' హిందీ రీమేక్ లో ఒక సన్నివేశంలో భాగంగా డూప్ లేకుండానే తన భుజంపై గన్ పౌడర్ ను వేసుకుని కాల్చుకున్నారు చిరంజీవి.

'బావగారు బాగున్నారా!' సినిమాలోని 'చల్నే దో గాడీ' పాటలో చిరంజీవి రియల్ గా 'బంగీ జంప్' చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.