సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం న్యూయార్క్ నగర వీధుల్లో సందడి చేస్తోంది. ఇటీవలే అమెరికా వెళ్లిన సామ్.. అక్కడి ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో పాల్గొంది. 'న్యూయార్క్ లో నా మొదటి సినిమా షూటింగ్ తో కెరీర్‌ని ప్రారంభించాను. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఇలా నిలబడి ఉన్నాను' అని సామ్ పేర్కొంది. ఈ సందర్భంగా అక్కడి ప్రేక్షకులు గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో పంచుకుంది. ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఓవైపు మోడరన్ గా, మరోవైపు ట్రెడిషన్ గా కనిపిస్తూ రాయల్ లుక్ లో ఆకట్టుకుంది. సామ్ న్యూయార్క్ నగరంలో హంగామా చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సమంత.. మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సామ్ కలిసి నటించిన 'ఖుషి' సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. 'ఖుషి' ప్రమోషన్స్ లో భాగంగా సామ్ ఇటీవల మ్యూజిక్ ఈవెంట్‌లో VD తో కలిసి చేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.