ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, 'మెగాస్టార్' స్థాయికి ఎదిగారు చిరంజీవి.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరులో కె. వెంకట్రావు-అంజనాదేవి దంపతులకు మొద‌టి సంతానంగా జ‌న్మించారు చిరు.

చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. తన తల్లి సూచన మేరకు సినిమాల్లో స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు.

చిరుకి స్టార్ డమ్ వచ్చిన తర్వాత నటించిన సినిమాల్లో 'సుప్రీమ్ హీరో' అనే టైటిల్ కార్డ్ పడేది.

టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకుని 'సుప్రీం హీరో' నుంచి 'మెగాస్టార్' గా అవతరించాడు.

చిరంజీవికి 'మెగాస్టార్' అనే టైటిల్ ఎలా వ‌చ్చింది? ఆ బిరుదు ఎవరిచ్చారు? అనేది చాలామందికి తెలియకపోవచ్చు.

చిరంజీవికి 'మెగాస్టార్' అనే టైటిల్ ని ప్ర‌ముఖ నిర్మాత‌ కేఎస్ రామారావు ఇచ్చారు.

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోకి 'మెగాస్టార్' అనే ట్యాగ్ ఉంటే బాగుంటుందని కెఎస్ రామారావు భావించారు.

తొలిసారిగా 'మరణమృదంగం' సినిమా టైటిల్ కార్డ్ లో 'మెగాస్టార్ చిరంజీవి' అని ప్రస్తావించారు.

అప్పటి నుంచి చిరు టాలీవుడ్ లో మెగాస్టార్ గా స్థిరపడిపోయారు. ఆయన కుటుంబం 'మెగా ఫ్యామిలీ'గా పిలవబడుతోంది.