అన్వేషించండి

BRS Leader Shakeel Arrest: పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్

BRS Leader Shakeel Arrest:చాలా కాలంగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న బీఆర్‌ఎస్ లీడర్ షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయన్ని శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు.

BRS Leader Shakeel Arrest: వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసులు నమోదు అయినప్పటి నుంచి ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. తల్లి చనిపోవడంతో హైదరాబాద్ వచ్చిన షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. 

దుబాయ్‌ నుంచి హైదరాబాద్ వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. తల్లి చనిపోవడంతో ఆయన దుబాయ్ నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో షకీల్‌ను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలు పూర్తి చేయాల్సి ఉందని చెప్పడంతో దానికి అనుమతి ఇచ్చినట్టు చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయనపై చాలా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో అరెస్టు తప్పదని గ్రహించి దుబాయ్ వెళ్లిపోయారు. 

దుబాయ్‌లో ఉన్న షకీల్‌పై పోలీసులు అరెస్టు వారెంట్‌, లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించిన షకీల్‌ను రప్పించలేకపోయారు. అయితే ఇంతలో అనారోగ్యంతో తల్లి మృతి చెందారు. షకీల్ రాక తప్పలేదు. వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు కూడా హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.  

షకీల్ కుమారుడు రాహిల్‌ ఆమిర్‌ 2022లో జూబ్లీహిల్‌ జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్నారు. అ్పట్లో శిశువు చనిపోయాడు. తర్వాత 2023 డిసెంబర్‌లో కూడా అలాంటి ప్రమాదం జరిగింది. ప్రజాభవన్ ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీ కొట్టి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తే సంబంధం లేని వ్యక్తులను అందులో ఇరికించేందుకు యత్నించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసులతో కుమ్మక్కై అతన్ని తప్పించారని విచారణలో తేలింది. 

హిట్ అండ్ రన్ కేసులో కుమారుడిని తప్పించడంలో షకీల్‌దే కీలక పాత్ర అని పోలీసులు అనుమానించారు. ఈ దిశగానే కేసును విచారించారు. కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆయన పాత్రను కన్ఫామ్ చేశారు. కేసు నమోదై విచారణ సాగతున్న టైంలోనే షకీల్ కూడా దుబాయ్ పారియారు. పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకోవడానికి తండ్రీకుమారుడు దుబాయ్‌లో తలదాచుకున్నారు. 

షకీల్ పూర్తి పేరు మొహమ్మద్ షకీల్ ఆమిర్‌. బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి 2014, 2018 రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పటి కాంగ్రెస్ అబ్యర్థి సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రం అదే సుదర్శన రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget