Viral Video: కారు ఓనర్‌ను చితక్కొట్టిన చిరు వ్యాపారి - ఈ వీడియో చూస్తే తప్పు ఎవరిదో మీకే తెలిసిపోతుంది !
UP: యూపీలో ఓ కారు ఓనర్‌ని కూరగాయల వ్యాపారి కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. కొట్టించుకున్న వ్యక్తికి కాకుండా కొట్టిన వ్యక్తికే ఎక్కువ సానుభూతి లభిస్తోంది.

UP News: ఎవరూ చూడలేదు కదా అని తన భార్య అందరి ముందూ తిట్టేసి వెళ్లిపోతే.. తల దించుకుని తన పక్కన స్నేహితుడ్ని అడుగుతాడు ఎవరూ చూడలేదు కదా అని. ఆ మిత్రుడు చుట్టూ చూసి.. కోడి పందేలు చూసినట్లుగా చూశారు మావా అని బోరుమంటాడు.. ఇది ఓ సినిమాలో సీన్.
ఇలాంటిదే కానీ.. సింగిల్ క్యారెక్టర్లతో ఓ సీన్ యూపీలో రీక్రియేట్ అయింది. యూపీలోని సంభాల్ అనే ఊళ్లో ఓ కూరగాయల వ్యాపారి తన లాగుడు బండిపై కూరగాయలు పెట్టుకుని వెళ్తున్నాడు. దారిలో రెండు కార్లు పార్క్ చేసి ఉన్నాయి. వాటి మధ్య నుంచి తన బండిని లాక్కెళ్లాడు. అయితే ఓ కారు యజమాని తన కారుకు కూరగాయల బండి తగిలిందని.. కేకలేయడం ప్రారంభించాడు. ఆ కూరగాయల బండి యజమాని పట్టించుకోలేదు. మెత్తగా ఉన్నాడని అనుకున్నాడేమో కానీ.. వెంటనే కారు యజమానికి కారు దిగి కూరగాయల వ్యాపారి మీదకు వెళ్లాడు.
संभल -सब्जी बिक्रेता और कार चालक में मारपीट, मारपीट का कारण कार में ठेला लगना
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) April 9, 2025
मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल, चंदौसी कोतवाली क्षेत्र का बताया जा रहा वीडियो#Sambhal @sambhalpolice @Uppolice pic.twitter.com/sozEIPGiM3
అయితే ఆ కూరగాయల వ్యాపారి ఆ వ్యక్తి కారు ఓనర్ అని సందేహించలేదు. నాలుగు కోటింగులు ఇచ్చాడు. చెడామడా కొట్టేసరికి డ్రైవర్ కు సీన్ అర్థమైపోయింది. చుట్టూ ఎవరూ చూడక ముందే నలిగిపోయిన బట్టలు సర్దేసుకుని తప్పుకోవడం మంచిదనుకున్నాడు. కొట్టించుకుని సైలెంట్ గా పక్కకు వెళ్లిపోయాడు. ఆ కూరగాయల వ్యాపారి తన దారిన తాను పోయాడు.
కానీ ఆ కారు యజమానికి తెలియనిదేమిటంటే.. ఎక్కువ మంది చూడకపోయినా ఓ వ్యక్తి కెమెరా కన్ను మాత్రం చూసింది. రికార్డు చేసింది. అంతే ఇప్పుడు ఆ కూరగాయల వ్యాపారి చేతిలో తన్నులు తిన్న వీడియోను దేశవ్యాప్తంగా కోడి పందేలు చూసినట్లుగా చూస్తున్నారు. అతి చూపించి కూరగాయల వ్యాపారితో కొట్టించుకున్న దాని కన్నా.. అందరూ నవ్వుతున్నదే ఆ కారు ఓనర్ కు ఇప్పుడు కాలిపోయేలా చేస్తూంటుంది.
If you don’t work out and drink alcohol 1-2 times in a week. Never fight, in 90% cases you will be beaten badly. If other person looks fit than don’t even shout or argue, he will beat you like a football.
— Dinesh Thakur (@DineshSEM) April 10, 2025
రోడ్లు ఉన్నది పార్క్ చేయడానికి కాదు. అడ్డంగా కారు పార్క్ చేసి.. దానికి చిరు వ్యాపారి బండి తగిలిదిందని రెచ్చిపోతే.. ఇలాంటి ట్రీట్మెంట్లే ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని వ్యాపారులు కాపాడుకుంటారు. ఆత్మగౌరవానికి, ధనిక, పేద తేడా ఉండదు.





















