Pune couple: చాలా ఏళ్ల తర్వాత నడిరోడ్డులో కలిశారు - హగ్ చేసుకుని అలాగే ఉండిపోయారు -కానీ ట్రాఫిక్ ఆగుతుందా ? వీడియో
Virl Video: అది బిజీ రోడ్. రోడ్ కు రెండు వైపుల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి రోడ్ మధ్యలో హగ్ చేసుకుని అలా అతుక్కుపోయారు. అక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

Pune couple hugs on busy road :ప్రేమికులు రకరకాలుగా ఉంటారు. అయితే వారిలో ప్రేమ పుట్టుకొచ్చినప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టం. అలాంటి ఓ జంట...పుణెలో కనిపించింది. ఆ జంట చేసిన పనికి చాలా మంది అసౌకర్యానికి గురయ్యారు. అలా అని వారు అంత అసభ్యకరమైన పనులేమీ చేయలేదు.
పుణెలో బాగా బిజీరోడ్డులో హఠాత్తుగా ఓ వ్యక్తి అటు వైపు నుంచి ఓ మహిళ ఇటు వైపు నుంచి అప్పుడే ఒకరినొకరు చూసుకున్నట్లుగా రోడ్డు మీదకు వచ్చారు. మధ్యలోకి రాగానే సినిమా స్టైల్లో హగ్ చేసుకున్నారు. అప్పటికి రెడ్ సిగ్నల్ ఉండటంతో వాహనాలన్నీ ఆగిపోయి ఉన్నాయి. హగ్ చేసుకుని పక్కకు పోతారని అనుకున్నారు. కానీ వారు అలా హగ్ చేసుకుని మైమరిచిపోయారు.[
Pune Viral Video: Couple Hugs In Middle Of Road In Pimple-Saudagar, Traffic Police Intervenes; Netizens Call It 'Staged'https://t.co/oeO0s493rz pic.twitter.com/nhuePIubmF
— Pune First (@Pune_First) April 8, 2025
ఎంత సేపటికి వారు విడిపోవడం లేదు. ఆ మైకం నుచి బయటకు రావడం లేదు. మరో వైపు గ్రీన్ సిగ్నల్ పడుతోంది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్లను డిస్ట్రబ్ చేద్దామా వద్దా అని కాసేపు ఆలోచించి.. ఇక తప్పదు అనుకుని వారిని వెళ్లి విడదీసే ప్రయత్నం చేశారు. టిల్లు సినిమాలో ... హే బాబూ అని పిలిచినట్లుగా.. చప్పట్లు కొట్టి.. హే లవర్స్ అని రెండు, మూడు సార్లు పిలిచినా వాళ్లు పలకలేదు. దాంతో గట్టిగా తట్టారు. అయినా కదల్లేదు.
पिंपळे सौदागर मध्ये भर चौकात टळटळीत उन्हात एकमेकांवर प्रेमाचा वर्षाव करणारं एक जोडपं.
— Ashutosh Wagh (@AshutoshPWagh) April 9, 2025
खरंच, लोकांनी ताळतंत्रच सोडलं आहे.
🤔🤨🙄 pic.twitter.com/ZpDal5WNGU
వారి యవ్వారం తేడాగా ఉందని చుట్టుపక్కల ఉన్న జనం వారి చుట్టూ గుమికూడారు. అప్పుడు తెలివిలోకి వచ్చిన జంట..చుట్టూ చూసి.. ఏ పీలింగ్స్ లేకుండా వారి దారిన వారు పోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కావాలని చేశారా.. లేకపోతే యాధృచ్చితంగా కలిశారా అన్నది నెటిజన్లకు పెద్ద సందేహంగా మారింది.
फेसबुक, व्हाट्सअप वर व्हायरल झालेला आहे. चौक तर पिंपळे सौदागरातीलच आहे. व्हिडिओ पण खराचं वाटतं आहे.
— Ashutosh Wagh (@AshutoshPWagh) April 9, 2025
అయితే వాళ్లు సిగ్గు వదిలేశారని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
अरे बापरे काय निर्लज्ज लोक आहेत. हा चौक आमच्या इथंलाच आहे. 🤦🏻♀️
— Vishakha Gupte (@VishakhaGupte85) April 9, 2025
ఆ వీడియో వైరల్ అయింది కానీ.. అందులో హగ్ చేసుకున్న జంట ఎవరో మాత్రం ఇప్పటికీ బయటకు తెలియలేదు. వారెవరో తెలిస్తే కావాలని చేశారా లేకపోతే ట్రూ లవ్వా అనేది తేలిపోతుందని కొంత మంది యువత ఉత్కంఠకు గురవుతున్నారు.





















