Paneer From Donkey Milk: తులం బంగారం పెట్టినా గాడిద పాలతో చేసిన పన్నీర్ రాదట! పూర్తి వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Paneer From Donkey Milk: ఆవు, గేదె పాలతో తయారు చేసిన పన్నీర్ చూసే ఉంటారు. దాని రేటు చూస్తే అబ్బో అంటారు. కానీ గాడిద పాలతో తయారు చేసిన పన్నీర్ ధర తెలిస్తే మాత్రం కింద పడిపోతారు.

Donkey Milk Paneer Rate: పన్నీర్ చాలా మందికి ఇష్టమైన వంటకం. అవు, గేదె పాలతో తయారు చేసి ఈ పదార్థంతో చేసే వంటకాలు అంటే ఇష్టపడని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. రోజూ పన్నీర్ పెట్టినా విసుక్కోకుండా తినేస్తారు. అందుకే పన్నీర్ ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఖరీదు చేస్తుంది గాడిద పాలతో చేసిన పన్నీర్.
సాధారణంగా గాడిద పాలు చాలా ఖరీదైనవిగా చెబుతారు. వాటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయని ప్రజలు ఎంత కాస్ట్ పెట్టైనా తాగుతుంటారు. అందుకే వాటికి అంత ఖరీదు. అలాంటిది వాటి నుంచి తయారు అయ్యే పన్నీర్ ఎంత ఖరీదో మీరే ఒకసారి ఆలోచించుకోండి. అందులో ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకడం లేదు కూడా.
గాడిద పాలే కాకుండా ఆ పాలతో తయారు చేసిన పన్నీర్, జున్ను కూడా చాలా ఖరీదైనవి. ఆవు, గేదె పాలతో తయారు చేసిన పన్నీర్ ధరే చాలా ఎక్కువని చాలా మంది అనుకుంటా ఉంటారు ముక్కున వేలేసుకుంటారు. అలాంటి వాళ్లు గాడిద పాలతో తయారు చేసిన పన్నీర్ ధర గురించి వింటే షాక్ అయ్యి కింది పడిపోవడం ఖాయం.
గాడిద పాలతో పన్నీర్ ఎందుకు అంత ఖరీదైనది?
భారతదేశంలో కిలో 300-400రూపాయలకు అమ్ముడయ్యే ఆవు, గేదె పన్నీర్ సామాన్యుల ప్లేట్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది. గాడిద పాలతో తయారు చేసిన పనీర్ కిలోకు లక్ష రూపాయలు ఖర్చవుతుంది. గాడిద పాలను ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. కారణం దానిలో లభించే అపారమైన పోషకాలు. ఇందులో ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, లైసోజైమ్ ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
గాడిద పాల ప్రత్యేకత
గాడిద పాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయని, ఇవి వ్యాధులతో పోరాడటానికి బలాన్ని ఇస్తాయని చెబుతారు. మెరిసే చర్మం కోసం రోమన్ రాణి క్లియోపాత్రా ఈ పాలతో స్నానం చేసేవారని కూడా చెబుతారు. గాడిద పాలు చాలా ఖరీదైనవి ఎందుకంటే ఇది రోజుకు 200 నుంచి 300 మి.లీ. పాలు మాత్రమే ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒక లీటరు పాలకు చాలా గాడిదలు అవసరం. దానిని పన్నీర్‌గా మార్చడానికి ప్రాసెసింగ్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 25 కిలోల గాడిద పాలను తీస్తే, దాని నుంచి ఒక కిలో పన్నీర్ మాత్రమే తయారు చేయవచ్చు.
లీటరు గాడిద పాల ధర మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది
ఒక లీటరు గాడిద పాల ధర లీటరుకు రూ. 5000 వరకు ఉంటుంది. దీని పాలలో ఎక్కువ లాక్టిక్ ఆమ్లం ఉంటుంది, దీని కారణంగా ఎవరికీ పొట్ట సంబంధిత సమస్యలు ఉండవు. ఇందులో ఆవు, గేదె పాల కంటే ఎక్కువ ఔషధ గుణాలు కూడా ఉన్నాయి, అందుకే దీనిని అనేక సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. భారతదేశంలోని అనేక స్టార్టప్‌లు గాడిద పాలపై పరిశోధనలు చేస్తున్నాయి. గాడిదల ఫామింగ్ గుజరాత్, తమిళనాడులో ఎక్కువ జరుగుతుంది.





















