Donkey Milk : గాడిదపాలు తాగితే కలిగే బెనిఫిట్స్ ఇవే.. ఆవుపాల కంటే మంచిదే కానీ, ఆ విషయంలో జాగ్రత్త
Donkey Milk Uses : గాడిద పాలు తాగితే నిజంగానే ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు. కానీ దీనిని ఎవరు తాగవచ్చు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Donkey Milk Benefits : గాడిద పాలుకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండే ఉంది. అయితే ఇదేదో ఇప్పుడు ట్రెండ్ అయింది అనుకోవద్దు. ఎప్పటినుంచో వివిధ అవసరాలకోసం ఈ పాలను వినియోగిస్తున్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి దీని వినియోగం అమలులో ఉంది. ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. గాడిద పాలల్లోని న్యూట్రిషియన్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. వీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి? ఏ విధంగా తీసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గాడిద పాలల్లోని న్యూట్రిషియన్స్ ఇవే
గాడిద పాలు కూడా ఆవు పాలు, తల్లి ఇచ్చి పాలల్లో ఉండే న్యూట్రిషియన్స్ని కలిగి ఉంటుంది. వీటిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇతర పాలతో పోల్చి చూస్తే.. గాడిద పాలల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వివిధ వైరస్లు, బ్యాక్టీరియాలు సోకకుండా కాపాడుతాయి. అలెర్జీలు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని కూడా మెరుగు పరుస్తాయి.
వినియోగాలు..
గాడిద పాలని మెడికల్, కాస్మోటిక్ అవసరాల కోసం ఎన్నో సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. ఆర్థ్రైటిస్, దగ్గు, గాయాలు మానేందుకు చికిత్సకోసం దీనిని ఉపయోగిస్తారు. ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. మృదువైన, స్మూత్ స్కిన్‌ని డాంకీ మిల్క్ ప్రమోట్ చేసే లక్షణాలు కలిగి ఉంటాయట. అందుకే దీనిని సబ్బులు, మాయిశ్చరైజర్స్, స్కిన్ క్రీమ్స్, షాంపూలలో వినియోగిస్తారు. అంతేకాకుండా వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ఎండలో స్కిన్‌కి ఇబ్బంది కలగకుండా కాపాడుతాయి. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.
గాడిదపాలతో ప్రయోజనాలు ఇవే..
గాడిదపాలతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అలెర్జీలను దూరం చేసి.. ఇమ్యూనిటీని పెంచుతాయి. ప్రోటీన్ కావాలనుకునేవారు ఆవు పాలకంటే గాడిదపాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనిలో లాక్టోస్ ఉంటుంది. ఇది కాల్షియంని శరీరం తీసుకునేలా చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఇవి హెల్ప్ చేస్తాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి మెరుగైన రక్తప్రసరణను అందించి.. బీపీని కంట్రోల్ చేస్తాయి.
సైడ్ ఎఫెక్ట్స్
గాడిదపాలు ఎక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. రెగ్యూలర్‌గా కూడా దొరకకపోవచ్చు. కాబట్టి ధర ఎక్కువగా ఉంటుంది. అలాగే కొందరిలో గాడిద పాలు అలెర్జీనిస్తాయి. ఇది రేర్ కేస్లలో జరుగుతుంది. మరికొందరిలో డయేరియా, కడుపునొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది. మరికొందరిలో రక్తాన్ని చిక్కగా చేస్తుందట. మెడిసన్స్‌తో కలిపి తీసుకున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయట. దీనిని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదముందట. కాల్షియం ఎక్కువై ఇబ్బందులు కలుగుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గాడిద పాలు తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. అలెర్జీ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎంతమోతాదులో తీసుకోవాలో కూడా తెలుసుకోవాలి. పచ్చిపాలు కూడా పాశ్చ్యరైజ్డ్, స్టెరిలైజ్డ్ పాలు మాత్రమే తీసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీలో ఉన్నవారు పాలు ఇచ్చే తల్లులు తీసుకోకపోవడమే మంచిది. అలెర్జీలతో ఇబ్బంది పడేవారు వీటికి దూరంగా ఉండడమే మంచిది.
Also Read : లిప్ ఫిల్లర్స్లోని రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బెనిఫిట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే