అన్వేషించండి

Lip Fillers : లిప్ ఫిల్లర్స్​లోని రకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. బెనిఫిట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే

Types of lip fillers : ఈ మధ్యకాలంలో బ్యూటీకి సంబంధించిన కాస్మోటిక్ ట్రీట్​మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వాటిలో లిప్ ఫిల్లర్స్ ఒకటి. ఈ ట్రీట్​మెంట్​ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే.

Cosmetic Treatment for Lips : తెరపైకి వచ్చే బ్యూటీ ట్రెండ్స్​లో లిప్ ఫిల్లర్స్ టాప్​ ప్రయారిటీగా మారిపోయింది. హీరోయిన్లు సైతం ఈ కాస్మోటిక్ ట్రీట్​మెంట్ బాట పట్టారు. తమ లుక్​ అందంగా కనిపించాలని చాలామంది ఇన్​ఫ్లూయెన్స్​ర్స్​ కూడా ఈ ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నారు. అసలు లిప్ ఫిల్లర్స్ ట్రీట్​మెంట్​ని ఎలా చేస్తారా? దీనివల్ల కలిగే మార్పులు ఏంటి? ట్రీట్​మెంట్​ లైఫ్​ లాంగ్ ఉంటుందా? లేదంటే ఎక్స్​పైయిరీ డేట్​ ఉంటుందా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 

లిప్ ఫిల్లర్స్ ప్రాసెస్..

లిప్ ఫిల్లర్స్ అనేది కాస్మోటిక్ ట్రీట్​మెంట్. ఇది బాగా పాపులర్​ కూడా. ఇది పెదాల సైజ్, షేప్, లుక్​ని మార్చే ఓ కాస్మోటిక్ ప్రక్రియ. లిప్​ ఫిల్లర్స్ అంటే.. లిప్ ఇంజెక్షన్లు, లిప్​ ఆగ్యూమెంటేషన్​, సర్జికల్ ప్రక్రియ లేకుండా.. పెదాల్లోకి ఫిల్లర్స్​ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ బ్యూటీ ట్రీట్​మెంట్​ని పెదాల షేప్​ మార్పుకోవడానికి, ముఖ్యంగా పెదాల సైజ్, వాల్యూమ్​ పెంచుకోవడానికి చేయించుకుంటారు. ముడతలు, ఫైన్ లైన్స్​ని దూరం చేసుకుని.. పెదాలు జ్యూసీగా కనిపించాలనే ఉద్దేశంతో ఈ ట్రీట్​మెంట్​ చేయించుకుంటారు. 

లిప్​ ఫిల్లర్స్​లో రకాలు.. 

లిప్ ఫిల్లర్స్​లో కూడా పలు రకాలు ఉంటాయి. హైల్యూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ (Hyaluronic acid fillers) ఒక రకం. ఇది తాత్కాలిక ఫలితాలు ఇస్తుంది. బయోడిగ్రేడబుల్, రివర్స్​బుల్ ఫిల్లర్స్ ఇవి. కొల్లాజెన్ ఫిల్లర్స్ (Collagen fillers) మరో రకం. వీటిని యానిమల్ ప్రొడెక్ట్స్​ నుంచి తయారు చేస్తారు. కాకుంటే వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. సింథటిక్ లిప్ ఫిల్లర్స్(Synthetic fillers). వీటిలో సిలికోన్, PMMA వంటివి ఉంటాయి. అయితే ఇవి శాశ్వత ఫలితాలు ఇస్తాయి. కాకపోతే.. రిస్క్ ఎక్కువ. కాంప్లికేషన్స్ ఉంటాయి. అటోలోగస్ ఫ్యాట్ ట్రాన్స్​ఫర్ (Autologous fat transfer). ఈ ట్రీట్​మెంట్​కోసం శరీరంలోని కొవ్వును తీసి.. లిప్​ని ఫిల్ చేస్తారు. 

ఉపయోగాలు ఏంటి?

ఈ లిప్ ఫిల్లర్స్ ప్రొసెస్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం 15 నిమిషాల నుంచి అరగంట సమయం సరిపోతుంది. డౌన్​ టైమ్​ కూడా చాలా తక్కువ. మీరు ఎలా కావాలనుకుంటే అలాంటి ఫలితాలు మీ లిప్స్​ విషయంలో పొందవచ్చు. తాత్కాలిక అడ్జెస్ట్​మెంట్స్ కూడా చేసుకోవచ్చు. వయసు ప్రభావం వల్ల పెదాలు మారడం, జెనిటిక్స్ వల్ల లిప్స్ సరిగ్గా లేకపోవండ లేదా పెదాలు బాలేవనే మీ ట్రోమాను దూరం చేసుకోవచ్చు. 

రిస్క్​ ఫ్యాక్టర్స్ ఇవే.. 

కొందరిలో లిప్ ఫిల్లర్స్ అలెర్జిక్ రియాక్షన్లు ఇస్తాయి. పెదాల్లో వాపు రావడం, అనుకున్నదానికంటే ఎక్కువగా మారడం, ఎరుపుదనం పెరిగి.. ఇన్​ఫెక్షన్లు రావడం, పెదాల షేప్ మారిపోవడం, చూసేందుకు ఇబ్బందిగా కనిపిచడం వంటివి జరుగుతాయి. మంటతో కూడిన ఇన్​ఫెక్షన్లు రేర్​గా వస్తాయి. 

ఎంతకాలముంటాయంటే..

లిప్ ఫిల్లర్స్​ని తాత్కాలికంగా చేయించుకోవచ్చు. 6 నుంచి 12 నెలలు ఉండొచ్చు. మరికొన్ని శాశ్వతమైన లిప్ ఫిల్లర్స్ ఉంటాయి. అయితే వీటికి కొన్ని టచ్​ అప్స్ అవసరమవుతూ ఉంటాయి. 

చికిత్స ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు ఈ బ్యూటీ ట్రీట్​మెంట్ తీసుకోవడానికి ముందు.. క్వాలిఫై అయిన డాక్టర్​ని సంప్రదించాలి. మీ మెడికల్ హిస్టరీ, అలెర్జీలు, మెడికేషన్స్ గురించి చెప్పాలి. లిప్ ఫిల్లర్స్ వల్ల కలిగే ప్రయోజనాలు, పర్యవసనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీ పెదాలకు, ముఖానికి తగిన లిప్ ఫిల్లర్​ ఎంపిక చేసుకోవాలి.

ఫాలో అవ్వాల్సిన టిప్స్

లిప్ ఫిల్లర్స్ చేయించుకున్న తర్వాత కూడా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వాపును తగ్గించుకునేందుకు ఐస్​ క్యూబ్స్​ని అప్లై చేయాలి. సున్నితమైన లిప్ కేర్ ప్రొడెక్ట్స్ ఉపయోగించాలి. వైద్యుల సూచనలు తప్పకుండా ఫాలో అవ్వాలి. ట్రీట్​మెంట్ ఫాలో అప్స్​ రెగ్యూలర్​గా అటెండ్ అవ్వాలి.

 

Also Read : అమ్మాయిలు సోలోగా ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget