బ్యూటీ సీక్రెట్స్

చర్మం మెరుస్తూ.. యంగ్​గా ఉండేందు ఈ బ్యూటీ సీక్రెట్స్ ఫాలో అయిపోండి

Published by: Geddam Vijaya Madhuri

డిఫరెంట్ స్కిన్

స్కిన్ టోన్ మెరుగవ్వాలని, ముడతలు రాకుండా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి స్కిన్ వేరుగా ఉంటుంది.

బ్యూటీ సీక్రెట్స్

కొన్ని బ్యూటీ సీక్రెట్స్ ట్రై చేస్తే.. మీ స్కిన్​ని హెల్తీగా ఉంచడంతో పాటు.. డల్ స్కిన్ పోయి.. మెరిసే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది.

హైడ్రేషన్

నీటిని తక్కువగా తీసుకుంటే డీహైడ్రేట్ అవుతారు. ఇది స్కిన్​ని డల్​గా చేస్తుంది. కాబట్టి రెగ్యూలర్​గా నీళ్లు, జ్యూస్​లు, స్మూతీలు, వాటర్​ కలిగిన ఫ్రూట్స్ తీసుకోవాలి.

ఫేస్ వాష్

​రోజుకు కనీసం రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేయాలి. వారానికోసారి ముఖాన్ని స్క్రబ్ చేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకుపోయిన మృతుకణాలు తొలగిపోతాయి.

మాయిశ్చరైజర్

ఫేస్ వాష్ చేసిన వెంటనే దానికి మంచి మాయిశ్చరైజర్ అందించాలి. ఇది స్కిన్​ని హైడ్రేట్ చేయడంతో పాటు.. డల్​నెస్​ని పోగొట్టి ప్రకాశవంతంగా మారుస్తుంది.

సన్​స్క్రీన్

ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. వర్షాకాలంలో అయినా వేసవి కాలంలో అయినా ముఖానికి కచ్చితంగా సన్​స్క్రీన్ అప్లై చేయాల్సిందే. ఇది ముఖం ట్యాన్​ కాకుండా కాపాడుతుంది.

మంచి డైట్

మంచి డైట్ తీసుకోవాలి. సలాడ్స్ వంటి పోషకాలతో నిండి ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యానికి, అందానికి కూడా ప్రయోజనాలు అందుతాయి. తీసుకునే ఫుడ్​ని ఎక్కువగా నమిలి మింగాలని గుర్తించుకోండి.

ఎక్సర్​సైజ్

రెగ్యూలర్​గా ఎక్సర్​సైజ్​ చేస్తే ఆరోగ్యం మంచిగా అవడంతో పాటు.. స్కిన్​కి కూడా మేలు జరుగుతుంది. ఫిజికల్​గా స్ట్రాంగ్​ ఉంటే.. స్కిన్​ కూడా హెల్తీగా మారుతుంది.

ఫేస్ ప్యాక్స్​

ఇంట్లో ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఫేస్ ప్యాక్స్​ అప్లై చేయాలి. సహజమైన ఫేస్​ ప్యాక్స్ రెగ్యూలర్​గా వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

హెల్తీ స్కిన్ కోసం

సిట్రస్ ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ వంటివాటిని డైట్​లో చేర్చుకోవాలి. ఇవి హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేసి ముడతలను దూరం చేస్తాయి.

అవగాహన కోసమే

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.