కొబ్బరి నీళ్లు రాత్రుళ్లు తాగొచ్చా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివి. కానీ రాత్రుళ్లు వాటిని తీసుకోవచ్చా? లేదా?

రోజంతా అలసిపోయిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.

వీటిలోని హైడ్రేషన్​ని అందించి.. శరీరానికి విశ్రాంతిని అందిస్తాయి. పొటాషియం నిద్రనిస్తుంది.

అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే నిద్రలో ఉన్నా.. వాష్​రూమ్​కి ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది.

నిద్ర సమస్యలున్నవారు వీటిని రాత్రుళ్లు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.

అందుకే వీటిని ఎక్కువగా కాకుండా ఒకటి లేదా రెండు కప్పులు తీసుకోవాలి.

షుగర్ తక్కువగా ఉండే లేత కొబ్బరి నీళ్లు తాగితే మంచిది.

నిద్రకు ఒకటి లేదా రెండు గంటల ముందు తాగితే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సూచనలు పాటిస్తే మంచిది. (Image Source : Envato)