తాగొచ్చా? లేదా?

ప్రెగ్నెన్సీ సమయంలో చెరకు రసం తాగొచ్చా? డాక్టర్లు ఇచ్చే సలహాలు ఏంటి?

Published by: Geddam Vijaya Madhuri

పోషకాలు నిండిన రసం ఇది

చెరుకురసంలో న్యూట్రెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం కూడా ఉంటుంది.

బేబీ గ్రోత్​కి

దీనిని తీసుకుంటే ఈ పోషకాలన్నీ బేబిగ్రోత్​ని ఇంప్రూవ్ చేస్తాయి. శిశువు పెరుగుదలకు మంచివి. కాబట్టి చెరకు రసం తీసుకోవచ్చని చెప్తున్నారు.

మలబద్ధకం..

ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్థకం అనేది ప్రధానమైన సమస్యల్లో ఒకటి. అయితే ఈ సమయంలో చెరకు రసం తీసుకుంటే ఆ సమస్య కచ్చితంగా దూరమవుతుంది అంటున్నారు. ఎసిడిటీ కూడా తగ్గుతుందట.

శక్తినిస్తుంది..

చెరకు రసం మీకు తక్షణమే శక్తిని ఇస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో కళ్లు తిరగడం, ఓపిక లేకపోవడం లాంటివి జరుగుతాయి. ఆ సమయంలో దీనిని తీసుకుంటే ఎనర్జీ వస్తుంది.

ఇమ్యూనిటీ..

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు రెగ్యూలర్​గా దీనిని తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ పెరిగితే సీజనల్ డీసీస్ రాకుండా హెల్తీగా ఉంటారు.

ఆ సమస్యలు దూరం

జలుబు, దగ్గు, డీహైడ్రేషన్​గా ఉన్నప్పుడు చెరకురసం తాగితే చాలామంచిది. దీనిలో ఎలక్ట్రోలైట్స్ హైడ్రేటింగ్​గా ఉంచుతాయి.

రక్తపోటు..

ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు రక్తపోటుతో ఇబ్బంది పడతారు. అయితే చెరకు రసంలోని పోటాషియం, మెగ్నీషియం దానిని కంట్రోల్ చేస్తుంది.

బరువు

ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు బాగా బరువు పెరుగుతారు. అలాంటివారు చెరకురసం రెగ్యూలర్​గా తీసుకుంటే మెటబాలీజం పెరుగుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.

హెల్తీ స్కిన్

ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు బ్యూటీ, హెయిర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. కెమికల్స్​కు దూరంగా ఉండాలనుకుంటారు. అప్పుడు చెరకు రసం తీసుకుంటే హెల్తీ స్కిన్, హెయిర్​ గ్రోత్​ని ప్రమోట్ చేస్తుంది.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)