డైట్లో ఇవి చేర్చుకోండి

జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Published by: Geddam Vijaya Madhuri

రెగ్యూలర్ ఫుడ్స్

మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకుంటే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ ఉంటుంది. వీటిని తినొచ్చు. హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

చిలగడ దుంపలు

వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఉంటుంది. ఇది జుట్టుకు పోషణ, మాయిశ్చరైజర్ అందిస్తుంది.

నట్స్, సీడ్స్

మీ డైట్​లో నట్స్, సీడ్​ని తీసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి మెరుగైన గ్రోత్ అందిస్తాయి.

ఫిష్

చేపలలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. ప్రోటీన్ కూడా జుట్టును స్ట్రాంగ్​గా మారుస్తుంది.

ఆకుకూరలు

ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు జుట్టు పెరుగుదలకు ప్రయోజనాలు చేకూరుస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. జుట్టు మెరవడాన్ని తగ్గిస్తాయి.

క్యారెట్స్

క్యారెట్​లలో బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి సెబమ్​ని రిలీజ్ చేస్తాయి. జుట్టుకు మాయిశ్చరైజర్​ను అందించి.. పొడిబారడాన్ని, జుట్టు డ్యామేజ్​ని తగ్గిస్తాయి. పైగా వీటిలోని విటమిన్ ఈ రక్తప్రసరణను పెంచి.. జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తుంది.

యోగర్ట్

ప్రోటీన్ నిండుగా కలిగిన యోగర్ట్ జుట్టుకు చాలా మంచిది. ఇది జుట్టు పెరుగుదలను ప్రమోట్ చేస్తాయి. స్కాల్ప్ హెల్త్​ని మెరుగుపరచి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

ఉసిరి

ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాలికల్స్​ను నారిష్ చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టును స్మూత్​గా, సిల్కీగా మారుస్తాయి.

అవకాడో

అవకాడోల్లో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఈ ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి స్కాల్ప్​ను హెల్తీగా చేస్తుంది. జుట్టుకు మాయిశ్చర్ అందించి.. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. (Images Source : Envato)