ప్యాకెట్ పాలను వేడి చేయడం మంచిది కాదా?

Published by: Anjibabu Chittimalla

పుష్కలంగా కాల్షియం..

పాలలో కాల్షియం, ప్రొటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఎముకలఆరోగ్యం..

కాల్షియం ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పాల ప్యాకెట్లు..

ఈ రోజుల్లో చాలా మంది పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.

వేడి చేయాల్సిన అవసరం లేదు..

ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

పాశ్చరైజేషన్..

పాలను ఆల్రెడీ పాశ్చరైజేషన్ చేసి ప్యాక్ చేస్తారు.

హానికర బ్యాక్టీరియా తొలగింపు..

పాశ్చరైజేషన్ తో పాలలోని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది.

పోషక విలువలు మాయం..

పాశ్చరైజ్ చేసిన పాలను మళ్లీ వేడి చేయడం వల్ల పోషక విలువ తగ్గిపోతాయి.

గోరు వెచ్చగా..

ప్యాకెట్ పాలను గోరు వెచ్చగా చేసి తాగితే మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.