కుడివైపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదా? నిద్రపోవడమే కాదు, ఎలా నిద్రపోయాం అనేది కూడా చాలా ముఖ్యం. వీలైనంత వరకు కుడివైపు పడుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. కుడి వైపు పడుకోవడం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. కుడివైపు పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ ను పెంచి జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెల్లకిల పడుకోవడం వల్ల వెన్నెముక రిలాక్స్ అవుతుంది. బోర్ల పడుకోవడం వల్ల మీ మెడ, వీపుపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే, బోర్ల పడుకోవడం వల్ల ఎక్కువ సేపు నిద్రపట్టే అవకాశం ఉంటుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com