ప్రపంచం దిగ్గజ బాడీబిల్డర్ ఐలియా గోలెం 36 ఏళ్లకే గుండెపోటుతో చనిపోయాడు.
మాన్‌స్టర్ బాడీబిల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు వరల్డ్ వైడ్ గా మాంచి ఫాలోయింగ్ ఉన్నది.
అతిగా వర్కౌట్స్ చేయడం వల్లే ఐలియా చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు.
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ ఐలియా మృతికి కారణం అయినట్లు వైద్యులు నిర్దారించారు.
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటే గుండె వేగం పెరిగి, లయ తప్పి, పంపింగ్ సామర్థ్యం దెబ్బతింటుంది.
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ కు గురైన వాళ్లు చాలా వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఐలియా కూడా విపరీతంగా ఫుడ్ తీసుకోవడంతో పాటు గంటలత తరబడి కసరత్తులు చేస్తాడు.
154 కేజీల బరువు ఉండే ఐలియా71 ఇంచ్‌లు ఛాతితో 7 వందల పౌండ్ల బరువులు ఎత్తుతాడు.
గత కొంతకాలంగా జిమ్ లో గంటల తరబడి వర్కౌట్స్ చేసే వాళ్లు గుండెపోటుతో చనిపోతున్నారు.