Santhanam: పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!
STR49 Movie: కోలీవుడ్ స్టార్ హీరో, కమెడియన్ సంతానం దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కమెడియన్‌గా 'STR49'లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో శింబుతో కలిసి ఆయన నటించనున్నారు.

Santhanam Re Entry As Comedian In Silambarasan 49 Movie: సంతానం (Santhanam).. పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా ఎదిగి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన ఏదైనా సినిమాలో కామెడీ చేస్తే ఆ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందనే బలమైన నమ్మకం ఆడియన్స్‌లో ఉంది.
పదేళ్ల తర్వాత కమెడియన్‌గా రీ ఎంట్రీ
కమెడియన్‌గా ఓ రేంజ్‌లో సక్సెస్ చూసిన తర్వాత సంతానం పలు చిత్రాల్లో హీరోగా నటించారు. కామెడీ రోల్స్ మానేసి పూర్తి హీరో రోల్స్‌పైనే ఫోకస్ చేశారు. అరై ఎస్ 305 11 కాదవుల్, కన్నా లడ్డు తిన్న ఆశయ్యా వంటి హాస్య చిత్రాల్లో హీరోగా నటించి ఇక కామెడీ రోల్స్ చేయనని ప్రకటించారు.
అయితే, ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత శింబు కొత్త సినిమా 'STR49'లో 'సంతానం' కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందుకోసం ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూ.13 కోట్లు డిమాండ్ చేయగా.. నిర్మాత అందుకు అంగీకరించారని సమాచారం. దాదాపు రూ.7 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఆయన కమెడియన్‌గా సినిమాల్లో చేయడం మానేసిన తర్వాత ఆయన రేంజ్‌లో కామెడీ చేసేవారు తమిళంలో కరువయ్యారనే చెప్పొచ్చు.
Also Read: తమన్నా సినిమాకు ట్విట్టర్ రివ్యూల్లేవ్... ముందు జాగ్రత్త పడిన 'ఓదెల 2' టీమ్
తెలుగు సినిమాల్లోనూ..
అటు, పలు తెలుగు సినిమాల్లోనూ తన కామెడీతో అలరించారు సంతానం. తమిళంలో మంచి విజయం సాధించి తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాల ద్వారా ఆయన తెలుగు వారికి సుపరిచితం. తొలిసారి విజయ్ టీవీలో ప్రసారమైన 'లోల్లు సభా' అనే షోలో తనదైన శైలిలో కామెడితో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత సిలంబరసన్ (శింబు) ఆయనకు 'వల్లవన్' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ సాధించడంతో ఇక కోలీవుడ్ స్టార్ కమెడియన్‌గా సంతానం చెరగని ముద్ర వేశారు. దర్శకుడు ధీరుడు 'రాజమౌళి' సైతం 'ఈగ' సినిమా కోసం ఆయన కాల్ షీట్ కోసం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయంటే సంతానం రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
STR49 మూవీలో..
ఇక 'STR49' మూవీ విషయానికొస్తే తమిళ స్టార్ సిలంబరసన్ (శింబు) (Silambarasan) హీరోగా 'పార్కింగ్' మూవీ ఫేం రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఈ మూవీలో సంతానం కమెడియన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శింబు వింటేజ్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమాలో మృణాల్ ఠాకూర్, కయాదు లోహర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రివేంజ్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇటీవలే శింబు 'థగ్ లైఫ్' సినిమాలో నటించారు. తాజాగా, శింబు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆత్మన్ సినీ ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన తన తదుపరి ప్రాజెక్ట్ 'STR50'ను స్వీయ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దీనికి పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు.





















