Jatadhara OTT : సడన్‌గా ఓటీటీలోకి సుధీర్ బాబు 'జటాధర' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Jatadhara OTT Platform : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రీసెంట్ నేచరల్ హారర్ థ్రిల్లర్ 'జటాధర' థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Sudheer Babu's Jatadhara OTT Streaming : నవ దళపతి సుధీర్ బాబు రీసెంట్ నేచరల్ హారర్ థ్రిల్లర్ 'జటాధర' గత నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో జటాధర స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైశ్వాల్ దర్శకత్వం వహించగా... సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటించారు. ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్, బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా కుమార్, రవికుమార్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని జీ స్టూడియోస్ సమర్పణలో కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు.
Also Read : ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
స్టోరీ ఏంటంటే?
గుప్త నిధులు వాటికి కాపలాగా ఉండే ధన పిశాచి బ్యాక్ డ్రాప్‌లో మూవీని తెరకెక్కించారు. దెయ్యాలు లేవని నమ్మే శివ (సుధీర్ బాబు) ఓ ఘోస్ట్ హంటర్. తన కళ్లతో చూస్తే తప్ప దేన్నీ నమ్మడు. తల్లి కోసం పూజలు చేస్తూ... మంత్రించిన తాయెత్తులు, తాళ్లు చేతికి కడతాడు. అతన్ని ఓ బాబు తన తల్లే చంపుతున్నట్లుగా ఎప్పుడూ ఓ కల వెంటాడుతూ ఉంటుంది. ఓసారి శివ ఫ్రెండ్ రుద్రారం అనే గ్రామంలో ఓ పాడుబడ్డ ఇంట్లో శోధన కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు.
ఆ ఇంట్లో ఉండే లంకె బిందెలకు కాపలాగా ఉండే ధన పిశాచే అతన్ని చంపి ఉంటుందని ఊర్లో ప్రచారం జరగడంతో ఆ ఊరికి బయలుదేరుతాడు. శివ తల్లిది రుద్రారం గ్రామమే కాగా ఆ ఊరితో సంబంధం లేకుండా అతన్ని పెంచుతుంది. ఆ ఊరికి ఎప్పటికీ వెళ్లకూడదని భావించిన అతని పేరెంట్స్ ఆ ఊరే వెళ్లాడని తెలిసి షాక్ అవుతారు. అసలు శివకి రుద్రారం ఊరికి సంబంధం ఏంటి? అతను జన్మించిన ఇంట్లో ధన పిశాచి ఉందా? శివ కలలో కనిపించే చిన్నారి ఎవరు? శివను ధన పిశాచి ఎందుకు బలి కోరుతుంది? ఈ విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















