Dies Irae OTT : ఓటీటీలోకి 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' - తెలుగులోనూ చూసెయ్యండి
Dies Irae OTT Platform : మలయాళ రీసెంట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Pranav Mohanlal's Dies Irae OTT Streaming : మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ 'A' రేటెడ్ హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి 'భ్రమ యుగం', 'భూతకాలం' వంటి హిట్ మూవీస్ తీసిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో గురువారం అర్థరాత్రి నుంచే 'డీయస్ ఈరే' స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హింద, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మలయాళంలో కేవలం 6 రోజుల్లోనే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీ తెలుగులోనూ మంచి టాక్ సొంతం చేసుకుంది.
మూవీలో ప్రణవ్‌తో పాటు సుస్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, అరుణ్ అజికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్ అధినేత రవి కిషోర్ రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read : ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
స్టోరీ ఏంటంటే?
ఆర్కిటెక్ట్ రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఫ్రెండ్స్, సరదాలతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. అతని తండ్రి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్. పేరెంట్స్ అమెరికాలో ఉంటే రోహన్ ఇక్కడే ఉండి చదువుకుంటుంటాడు. ఓ రోజు తన ఫ్రెండ్ కణి (సుస్మితా భట్) సూసైడ్ చేసుకుందని తెలిసి వారి ఇంటికి రోహన్ పరామర్శకు వెళ్తాడు. అయితే, వారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అతని లైఫ్‌లో ఏవేవో మార్పులు చోటు చేసుకుంటాయి. తనను ఎవరో తరుముతున్నట్లు ఉంటుంది.
కణి ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచే తనకు ఇలా జరుగుతుందని భావించిన రోహన్... కణి పక్కింట్లో ఉండే మధు (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. వీళ్లు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే కణి తమ్ముడు కిరణ్ (అరుణ్ జిజి కుమార్) ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోతాడు. ఇది చూసిన ఇద్దరూ షాక్ అవుతారు. అసలు రోహన్ ఇంట్లో ఉన్నది ఎవరు? కణి ఆత్మే ఇలా చేస్తుందా? రోహన్ వెంట ఉన్నది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















