Akhanda 2: ‘హిందూ మతం’ - ‘సనాతన హైందవ ధర్మం’.. రెండూ వేరు వేరా?
Akhanda 2: Thaandavam (2025) : చాలామంది హిందూ మతం, సనాతన హైందవ ధర్మం రెండూ ఒకటే అనుకుంటారు. కానీ రెండూ ఒకటి కాదు..వాటిమధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది...అదేంటో వివరణాత్మకంగా తెలుసుకుందాం..

Akhanda 2: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ అఖండ 2 తాండవం. ఈ మూవీలో సనాతన ధర్మం శక్తి, పరాక్రమం చూస్తారని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నారు బాలయ్య. ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమా చూపించాలని అన్నారు. ఇంతకీ హిందూమతం, సనాతన హైందవ ధర్మం ఒకటేనా? రెండింటి మధ్యా వ్యత్యాసం ఉందా?
హిందూ మతం, సనాతన హైందవ ధర్మం అనే రెండు పదాలు..ఒకే శాశ్వత సత్యాన్ని సూచిస్తాయి కానీ వాటి అర్థాల్లో సూక్ష్మమైన బేధం ఉంది.
హిందూమతం
హిందూ అనేది భౌగోళిక పదం..సింధు నదికి అవతల ప్రాంతంలో ప్రజలను సూచించేందుకు విదేశీయులు ఇచ్చిన పేరు. హిందూ మతం అనేది ఆచారాలు, సంప్రదాయాలు, ఆరాధనా విధానాలతో కూడిన ఓ మతం..ఇది చరిత్రకు, సమాజానికి సంబంధించినది..
సనాతన ధర్మం
సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది, మార్పులేని ధర్మం అని అర్థం. ఇది కాలం, దేశం, వ్యక్తికి అతీతమైన విశ్వవ్యాప్త నియమాలతో కూడినది. ఇది కేవలం మతంకాదు..జీవన విధానం. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విద పురుషార్థాలను కలిగి ఉంటుంది. వేదాలు, ఉపనిషత్తులు లాంటి ఆధ్యాత్మిక సత్యాలను బోధిస్తుంది. ఇది ఆత్మ సాక్షాత్కారం వైపు సాగే మార్గం..సకల జీవరాశికి సార్వత్రికమైనది. సనాతన హైందవ ధర్మం అనేది స్థాపించిన మతం కాదు.. రుషులు, శాసనాలు, తత్వాలు కలిసే సహజ , శాశ్వత జీవన పద్ధతి
ఆధ్యాత్మిక వేత్తలు ఏం చెబుతారంటే!
సనాతన ధర్మం అనేది మానవాతీతమైనది..నిత్యం, శాశ్వతం అయిన ఇది విశ్వశాంతిని, సత్యాన్వేషణ, సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది
హిందూ మతం దాని బాహ్యరూపం అయితే..సనాతన ధర్మం ఆంతరంగిక సారాంశం...
రెండూ ఒక్కటే కానీ సనాతన ధర్మం మరింత లోతైన, శాశ్వతమైన దృక్ఫథాన్ని ఇస్తుంది
హిందూమతంలో..దైవారాధన, పూజా పద్ధతులు, ధ్యానం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఉంటాయ్..వీటికి మూలం సనాతన ధర్మమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సనాతన ధర్మం అనే మూలానికి..హిందూమతం వికసించిన పూవు లాంటిది
సనాతన ధర్మంలో వివిధ మార్గాలున్నాయి.. శైవ, వైష్ణవ, శాక్త, స్మార్త, భక్తి, జ్ఞానం, యోగ, కర్మ, తంత్ర, నాస్తిక, ఆస్తిక, అద్వైత సహా నాస్తికవాదం కూడా ఇందులో భాగమే. ఎందుకంటే సనాతన ధర్మం దేవుడిపై నమ్మకాన్ని బలవంతం చేయదు. సత్యాన్ని, ధర్మాన్ని అన్వేషిస్తే సరిపోతుంది. జైన, బౌద్ధ మతాలు కూడ సనాతన ధర్మం నుంచి పుట్టినవే..మీరు భగవంతుడిని నమ్మకపోయినా పర్వాలేదు కానీ ధర్మం పాటించాలి అనే తత్వం ఈ కోవకే చెందుతుంది
సనాతన ధర్మం భగవంతుడిని నమ్మమని చెప్పదు..సత్యం, న్యాయం, ధర్మం పాటించమని చెబుతుంది..ఈ మర్గాలను అనుసరించేవారంతా సనాతనధర్మాన్ని ఆచరిస్తున్నట్టే..
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించిన సమాచారం మాత్రమే. ఇక్కడ ABPదేశం ఏదైనా నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.
తత్పురుషం,అఘోరం, సద్యోజాతం, వామదేవం మీరు పూజించే రూపం ఏది - శివతత్వం ఏం చెబుతోంది!
మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
నేనే శివుడిని! భయం లేదు, భేదం లేదు..నిజమైన అఘోరాలు ఎలా ఉంటారో తెలుసా? భయానక సత్యాలు, రహస్యాలు!






















