Nara Lokesh Saves Life: నారా లోకేష్ చేసిన ఈ పని కళ్లు చెమర్చేలా చేస్తుంది - ఒకరి ప్రాణం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ?
Nara Lokesh: నారా లోకేష్ ఒకరి ప్రాణం కాపాడేందుకు శరవేగంగా స్పందించారు. గుండె మార్పిడి ఆపరేషన్ కోసం అర్గాన్ తరలింపు కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఏర్పాట్లు చేశారు.

Nara Lokesh: సినిమాల్లో మాత్రమే ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. ఓ వ్యక్తి ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యాయి. మరో వ్యక్తి గుండె మార్పిడి ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతారు. ఓ వైపు ఆర్గాన్ డొనేషన్ కు బ్రెయిన్ డెడ్ కుటుంబం ఓకే చెప్పినా.. ఆర్గాన్ ను ఆపరేషన్ అవసరమైన చోటుకు తరలించాలంటే ట్రాన్స్ పోర్టు కష్టం. ఇలాంటి సమయంలో హీరో రంగంలోకి వస్తాడు. సమస్యను పరిష్కరిస్తాడు. ఇది సినిమాల్లో కనిపించే సీన్. కానీ నిజంగా నారా లోకేష్ ఈ సీన్ లో హీరోలాగా ఎంట్రీ ఇచ్చి ఆ ప్రాణాన్ని కాపాడేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
రమేష్ ఆస్పత్రిలో చెరుకూరి సుష్మ అనే మహిళ బ్రెయిన్ డెడ్
గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ అనేయువతి బ్రెయిన్ డెడ్ అయ్యారు. జీవచ్ఛవంలా మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆమె అవయవదానానికి అంగీకరించారు. ఆర్గాన్స్ ఎవరెవరికి అవసరమో.. అప్పటికే ప్రత్యేక నమోదు వ్యవస్థ ఉంది. వారిలో అవసరమైన వారికి ఆర్గాన్స్ పంపేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో ఓ పేషంట్ కు గుండె మార్పిడి చేయవచ్చని గుర్తించారు. అయితే అక్కడకు సుష్మ ఆర్గాన్ ను తరలించడం కష్టసాధ్యంగా మారింది. విజయవాడ నుంచి తిరుపతికి ఆ సమయంలో విమానాల్లేవు. రోడ్డు మార్గం ద్వారా వెళ్తే సమయం సరిపోదు.
సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్
ఈ సమస్యపై వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కు ఒక్క మెసేజ్ పంపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతి ఆస్పత్రికి గుండె చేరేవరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. అసాధ్యం అనుకున్న పని ప్రత్యేక విమానం సొంత ఖర్చుతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో సుసాధ్యం కావడంతో గుండె మార్పిడి విజయవంతం చేసేందుకు వైద్యులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆపరేషన్ సక్సెస్ అయి ఓ ప్రాణం నిలబడాలని కోరుకుంటున్న జనం
మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో.. ఒకరి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం చేయనుంది. గ్రీన్ ఛానల్‌కు మార్గం సుగమం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపరే,న్ విజయవంతం కావాలని చెరుకూరి సుష్మ తన గుండ ద్వారా పునర్జన్మ పొందాలని అందరూ కోరుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

