Peddi First Look: రామ్‌చరణ్ 'పెద్ది' ఫస్ట్ లుక్ - అచ్చం 'పుష్ప'లానే ఉందంటూ ఫ్యాన్స్ రియాక్షన్.. మరికొందరేమో ఆ హీరోలా ఉన్నాడంటూ..
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ఫస్ట్ లుక్‌పై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కొత్త చర్చకు తెరలేపారు. ఈ లుక్ అచ్చం 'పుష్ప'లానే ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan's Peddi First Look Compared With Pushpa Allu Arjun: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో లేటెస్ట్ మూవీ 'పెద్ది'. చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నోట్లో బీడీ, ముక్కుకు పోగుతో, గెడ్డంతో చరణ్ లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. 'ఓ మనిషి.. ప్రకృతికి ఓ శక్తి' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
అచ్చం 'పుష్ప'లానే ఉందేంటి?
అయితే, సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు 'పెద్ది'లో రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌పై చర్చ సాగుతోంది. అది అచ్చం 'పుష్ప'లో అల్లు అర్జున్‌లానే ఉందంటూ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. ఒకటి పుష్పలో అల్లు అర్జున్‌లా ఉందని.. మరొకటి కేజీఎఫ్‌లో యష్‌లా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'నాకొక్కడికేనా.. మీక్కూడా అలానే అనిపిస్తుందా?' అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
#PeddiFirstLook #PEDDI #Pushpa#RamCharan#BuchiBabuSana #sukumar
— Witty Doc (@humourdoctor) March 27, 2025
Fits perfectly though pic.twitter.com/oUKfqQWRtR
ఓ పోస్టర్‌లో చరణ్ బీడీ కాలుస్తూ మాస్ లుక్‌లో కనిపించగా.. మరో పోస్టర్‌లో చరణ్ ఓ ఆయుధం పట్టుకుని ఉండగా.. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్నట్లు ఉంది. ఓ ఫైట్ సీన్‌లో లుక్ అని పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. అయితే, పుష్ప వైబ్స్ గుర్తుకొచ్చాయంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు. పుష్పలాగే 'పెద్ది' కూడా అదే ఇంటెన్సిటీతో కనిపిస్తున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.
Oreyy Ra1 ga 😭
— salaarodu (@Tfi_banisa69) March 27, 2025
Ni theory lu thagaletta kgf boggu gola
ndhi raa 🤣🤣 #PEDDI #HBDRamCharan #RC16 pic.twitter.com/zxzjlfPqRR
చరణ్ ఫ్యాన్స్ కౌంటర్
మరోవైపు, ఈ కామెంట్స్‌పై చరణ్ ఫ్యాన్స్ ఇదే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా చరణ్ 'రంగస్థలం' మూవీ నుంచి వచ్చిందే అంటూ వాదిస్తున్నారు. ఓ అభిమాని చిట్టిబాబు లుక్ నుంచే పుష్ప లుక్ వచ్చిందని కామెంట్ చేశాడు. మరికొందరు అసలు లుక్స్‌కు ఎలాంటి పోలికే లేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం లుక్స్ విషయంలో ఓ కొత్త వాదనకు తెరతీశారు.
Also Read: 'RRR చూసిన తర్వాతే తెలుగు నేర్చుకున్నా' - జపాన్ అభిమాని మాటలకు ఎన్టీఆర్ ఫిదా.. వైరల్ వీడియో
గ్లింప్స్ కోసం ఆసక్తిగా..
ఈ మూవీలో చరణ్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ రివీల్ చేయగా ఆకట్టుకుంటోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, ఫస్ట్ లుక్ అదిరిపోగా.. ఇప్పుడు గ్లింప్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

