Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Tirumala : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అపచారం జరిగింది. తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
Tirumala : తెలుగు ప్రజలు ఎంతో పవిత్రమైన ప్రాంతంగా పరిగణించే తిరుపతిలో అపచారం జరిగింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. అన్నమయ్యను ఇలా అవమానించడంపై రాష్ట్రంలో ఆందోళలు మొదలయ్యాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.
శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడిని కించ పరిచేలా దుండగులు వ్యవహరించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
విషయం తెలిసిన భజరంగ్ దళ్ తో పాటు ఇతర హిందూ సంఘాల నాయకులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని నిరసనకు దిగాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. న్యాయం కావాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో తిరుమల శ్రీవారిని సందర్శించి భక్తులు నిండు మనసుతో కొలుచుకుంటారు. స్వామి వారి కొసం కొన్ని వందల కిలో మీటర్ల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కంపార్ట్ మెంట్ లలో గంటల పాటు వెయిట్ చేసి ఆ ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న తిరుమలలో ఈ మధ్యే కొత్తగా టీటీడీ బోర్డు ఏర్పడింది. అయితే.. తిరుమలలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఘటన ఇటీవల ఆలస్యంగా బైటికొచ్చింది. 2021లో తిరుమల శ్రీవారి ఆలయంలోని రాములవారి ఉత్సవ విగ్రహం వేలు విరిగిపోయింది. అయితే అప్పటి టీటీడీ సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత అధికారులు, పండితులు మరమ్మత్తులు చేయించి పూజలు జరిపించారు. స్వామి వారి విగ్రహంవేలు విరిగిపోతే ఇన్నాళ్లపాటు పట్టించుకోరా అప్పట్లో భక్తులు మండిపడ్డారు. దీనిపై వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.
వదంతులను నమ్మకండి-టీటీడీ
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వచ్చాయి. సాధారణంగా బ్రహ్మోత్సవాల ముందు నుంచే ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేయడం ఆనవాయితీ వస్తోంది. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ద్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేశారు. అంతలోనే దాన్ని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేశాయి. ఈ విషయంపై స్పందించిన టీటీడీ.. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని మరొకసారి తెలియజేసింది.
Also Read : AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా