Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 గురించి చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన ఘటన కాకినాడలో జరిగింది.
Police arrest thief who stole bus after watching Pushpa 2 movie | కాకినాడ: అసలే ఓవైపు పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట వివాదం కొనసాగుతోంది. ఏదో ఓ చోట పుష్ప తరహాలో స్మగ్లింగ్ అనే వార్తలు సైతం రెగ్యూలర్‌గా వింటూనే ఉన్నాం. ఈ క్రమంలో ఓ దుండగుడు పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం నాడు కాకినాడ జిల్లా నర్సీపట్నం వచ్చాడు. అల్లు అర్జున్ నటించినే లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2 మూవీ చూసి బస్టాండులోని బస్సులో నిద్రించాడు. ఈ క్రమంలో బస్సుకు తాళం ఉండటాన్ని చూసి గమనించాడు. ఇంకేముంది.. బస్సు స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లాడు. సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద నిందితుడు బస్సు ఆపి అక్కడ పడుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు చింతలూరు వెళ్లి బస్సును స్వాధీనం చేసుకున్నారు. బస్సులోనే పడుకున్న దొంగను అరెస్ట్ చేశారు.
పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు...
— Telangana Awaaz (@telanganaawaaz) December 24, 2024
తమిళనాడుకు చెందిన సాదిక్ ఆదివారం కాకినాడ జిల్లా నర్సీపట్నంకు వచ్చి పుష్ప 2 చూసి బస్టాండులోని బస్సులో పడుకున్నాడు.
బస్సుకు తాళం ఉండటాన్ని చూసి స్టార్ట్ చేసి సీతారామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ పడుకున్నాడు.… pic.twitter.com/SZ2b9Wctyv
నర్సీపట్నం టౌన్ ఐసీ గోవిందరావు దీనిపై స్పందించారు. తాను పోలీస్ స్టేషన్‌లో ఉండగా ఉదయం ఓ కంప్లైంట్ వచ్చిందన్నారు. గీతం రాజు అనే వ్యక్తి అద్దె బస్సులు నడుపుతున్నారు. తుని, నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసీ బస్సు రాత్రి మిస్సయింది. రాత్రి పార్కింగ్ చేసిన బస్సును పొరపాటున బస్సులోనే వదిలివేశారు. ఈరోజు ఉదయం నాలుగున్నర గంటలకు డ్రైవర్ వచ్చి చూడగా బస్సు కనిపించలేదు. బస్సు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేయగా, వెంటనే తుని, చింతపల్లి రూట్లో రెండు టీమ్స్ ఏర్పాటు చేసి చెక్ చేశాం. చింతపల్లి పరిధిలో బస్సు ఉందని సమాచారం రాగా, అక్కడి టీమ్‌ను అలర్ట్ చేయగా వెళ్లి బస్సును గుర్తించారు. నిందితుడు బస్సులోనే నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీలో సైతం అన్ని రికార్డ్ అయినట్లు ఆధారాలు ఉన్నాయి. 2016 మోడల్ బస్సు చోరీ అయింది, విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు. గతంలో హెవీ వెహికల్స్ నడిపిన అనుభవం ఉందని తెలిపారు.