Team India Squad Champions Trophy 2025 | ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా జట్టు ఇదే | ABP Desam
మినీ వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టు వచ్చేసింది. ఊహాగానాలకు, షాక్ తెరదించుతూ హిట్ మేన్ రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా సమరానికి సై అంటోంది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా జట్టును బీసీసీ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ టీమిండియా జట్టును ప్రకటించారు. సీనియర్ ప్లేయర్, టీ20 వరల్డ్ కప్ ను గెలిపించిన రోహిత్ శర్మ పై బీసీసీఐ మరోసారి భరోసా ఉంచగా..వైస్ కెప్టెన్ గా ప్రిన్స్ శుభ్ మన్ గిల్ పేరు ను ప్రకటించింది. ఓపెనర్లుగా రోహిత్, గిల్ ఆడనుండగా వన్ డౌన్ లో కొహ్లీ, తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్ కే బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు ఉంది. కేఎల్ రాహుల్ కీపర్ గా కూడా వ్యవహరించనున్నాడు. రాహుల్ కి బ్యాకప్ గా రిషభ్ పంత్ ను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్క్వాడ్ లో ఉన్నారు. మనకు మరోసారి బౌలింగ్ వజ్రాయుధం కానుంది. కారణం గాయం తర్వాత రెండేళ్ల నిరీక్షణను దాటుకుని మహ్మద్ షమీ జట్టులోకి తిరిగి వస్తున్నాడు. గాయం కారణంగా ఆడతాడో లేదో అన్న సందేహాలను పటాపంచులు చేస్తూ స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా టీమ్ లో ఉంటాడని అర్థమైపోయింది. వీళ్లిద్దరూ కాకుండా లెఫ్టార్మ్ పేసర్ అర్ష దీప్ సింగ్ స్క్వాడ్ లో ఉన్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్, బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే స్క్వాడ్ లో ఉండనున్నాడు. భారత్ తన మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడనుండగా..కీలకమైన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. ఓన్లీ భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో...మిగిలిన మ్యాచ్ లనన్నీ పాకిస్థాన్ లో జరగనున్నాయి.





















