అన్వేషించండి

8th Pay Commission : 8వ వేతన సంఘంతో ఏ రాష్ట్ర ఉద్యోగుల జీతం ముందుగా పెరుగుతుంది - ఎక్కువ జీతం ఏ రాష్ట్ర ఉద్యోగులకు వస్తుందంటే.

8th Pay Commission : 8వ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.

8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇప్పుడు అందరి దృష్టీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెరుగుదలపై పడింది. చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి ఈ కమిషన్ లో ఉద్యోగుల జీతాలు ఎంత పెరగొచ్చు? ఏ రాష్ట్ర ఉద్యోగులకు మొదట జీతం పెరుగుతుంది అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

సాధారణంగా వేతన కమిషన్ పది పదేళ్లకు ఒకసారి మారుతుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ అమల్లో ఉండగా.. డిసెంబర్ 31, 2025తో దీని వ్యవధి ముగుస్తుంది. ఇది జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. ఇక ఇటీవల 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన రావడంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వేతన సంఘం అమలులోకి వస్తే ముందుగా ఏ రాష్ట్రం ప్రభావితం అవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందన్న విషయంపై ఇప్పవటివరకు ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించనప్పటికీ.. నిపుణుల అంచనాలు మాత్రం వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాష్ట్రాలపై 8వ వేతన సంఘం ప్రభావం

8వ వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. 7వ వేతన సంఘం సమయంలో, చాలా రాష్ట్రాలు కేంద్రం సిఫార్సులను ఆమోదించాయి. అయితే, ప్రతి రాష్ట్రం దాని విధానాలు, గడువులు మారుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కేంద్రం తన ఉద్యోగులపై 8వ వేతన కమిషన్‌ను అమలు చేసిన క్షణం నుండి, రాష్ట్రాల ఉద్యోగులపై కూడా 8వ వేతన కమిషన్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదు. కొత్త వేతన సంఘం సిఫార్సులు రాష్ట్రాలకు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సిఫార్సులను ఎలా అమలు చేస్తారంటే..

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వేతన సంఘం కొత్త సిఫార్సులను అమలు చేసినప్పుడే.. వాటిని ఎలా అమలు చేయాలనే దానిపైనా రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఆ తరువాత, ప్రతి రాష్ట్రం దాని బడ్జెట్, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఒక ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రాలు తమ అవసరాలు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వేర్వేరు వేతనాలను నిర్ణయిస్తాయి. అయితే, ప్రస్తుత వేతనాన్ని కొత్త పే స్కేల్‌గా మార్చడానికి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉపయోగించబడుతుంది. కేంద్రం కూడా అదే చేస్తుంది.

ఉదాహరణకు, ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57. ఒకవేళ దీన్ని 2.86కి పెంచినట్లయితే, ఉద్యోగుల ప్రస్తుత బేసిక్ జీతం 2.86తో గుణించాల్సి ఉంటుంది. అలా వచ్చే కొత్త సంఖ్య మీ పెరిగిన బేసిక్ జీతం అవుతుంది. ద్రవ్యోల్బణం ప్రకారం ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతారు. 7వ వేతన సంఘం ప్రకారం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం 20-25 శాతం పెరిగింది. 

ఏ రాష్ట్ర ఉద్యోగులకు మొదట జీతం పెరుగుతుందంటే..

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని అమల్లోకి తెచ్చిన వెంటనే.. రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలను జారీ చేస్తుంది. అయితే వాటిని ఎలా అమలు చేయాలన్నది మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, గతంలో అమలైన వేతన కమీషన్ల నిర్ణయాలను పరిశీలిస్తే, పెద్ద, ధనిక రాష్ట్రాల్లో, ఈ సిఫార్సులు త్వరగా అమలు చేస్తున్నారు. 7వ వేతన కమిషన్ సమయంలో అయితే మొదటగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల ఉద్యోగులకు ముందుగా జీతాలు పెరిగాయి. ఇక ఏ రాష్ట్ర ఉద్యోగులకు ఎక్కువ జీతం అందుకుంటారు అన్న విషయానికొస్తే.. మునుపటి సిఫార్సుల ప్రకారం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల ఉద్యోగులకు ఎక్కువ జీతం వచ్చే అవకాశముంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బలంగా ఉండడం వల్లనే.

Also Read : Sanjay Roy : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక అప్‌డేట్‌- సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget