అన్వేషించండి

MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !

Underground House Madhya Pradesh: ఇంట్లోంచి గెంటేయడంతో మధ్యప్రదేశ్ జహాబువాకు చెందిన అర్జున్ భూమి లోపల వినూత్నంగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఫైర్‌ప్లేస్‌తో ఉన్న ఈ అండర్‌గ్రౌండ్ హోమ్ వీడియో వైరల్ అయింది.

MP Content Creator Arjun Underground Shelter: తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తే ఎవరైనా  పక్కింటికో, రెంట్ హౌస్‌కో వెళ్తాడు.. కానీ ఈ తండ్రికి తగ్గ తనయుడు ఏకంగా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు!.  అండర్ గ్రౌండ్ అంటే.. అండర్ గ్రౌండే. భూమి లోపల ఇల్లు కట్టేసుకున్నాడు. 

మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాకు చెందిన అర్జున్ అనే కంటెంట్ క్రియేటర్ చేసిన పనికి నెటిజన్ల మైండ్ బ్లాక్ అయిపోతోంది. ఇంట్లోంచి గెంటేయగానే డిప్రెషన్‌లోకి వెళ్లకుండా, ఏకంగా భూమిని తవ్వి ఐరన్ మ్యాన్ రేంజ్‌లో సీక్రెట్  అండర్‌గ్రౌండ్ హోమ్  కట్టేసుకున్నాడు. కిటికీలు లేవు, తలుపులు అంతకంటే లేవు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇతగాడి అండర్‌గ్రౌండ్ హోమ్ టూర్ వీడియో రచ్చ రంబోలా సృష్టిస్తోంది!

ఈ  మిస్టర్ గుహ మానవుడి  డిజిటల్ విల్లాలోకి తొంగి చూస్తే.. చక్కగా మట్టితో తయారు చేసిన ఒక ప్లాట్‌ఫామ్ ఉంది, దానికి ఒక చాప, బెడ్‌షీట్ వేసి డీలక్స్ బెడ్‌లా మార్చేశాడు. పైన వర్షం పడకుండా ఒక తార్పాలిన్ ప్లాస్టిక్ కవర్ చుట్టేసి, గోడలకే చేతితో చెక్కిన సీక్రెట్ షెల్ఫ్‌లు తయారు చేశాడు. ఇక అండర్‌గ్రౌండ్‌లో చలి కాచుకోవడానికి, వంట వండుకోవడానికి చిన్న పొయ్యి కూడా అమర్చుకున్నాడు. అబ్బో! ఆధునిక యుగంలో ప్రాచీన రాతియుగం నాటి అనుభూతిని సొంతం చేసుకోవడం అంటే ఇదేనేమో!

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! మనోడు రాతియుగం నాటి గుహలో ఉంటున్నా.. డిజిటల్ క్రియేటర్ కదా! అందుకే ల్యాప్‌టాప్ వాడుతున్నాడు, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటుండు! భూమి లోపల కనీసం గాలి ఆడే మార్గం సరిగా లేకపోయినా.. కరెంట్ వైరింగ్ ఎక్కడి నుంచి లాగాడో, ఆ వైర్లు ఎక్కడ కనెక్ట్ చేశాడో కానీ ఏకంగా వైఫై, ల్యాప్‌టాప్‌తో ఫుల్ బిజీ అయిపోయాడు.  అబ్బా ఏమా సృజనాత్మకత   అని కొందరు ల్యాప్‌టాప్ స్క్రీన్ వెలుగులో ఇతగాడిని చూసి ఆశ్చర్యపోతుంటే, కరెంట్ బిల్లు కట్టకుండా నేరుగా భూమి నుంచి ఎనర్జీ తీసుకుంటున్నాడా ఏంటి " అని నెటిజన్లు కామెడీ కామెంట్లు పెడుతున్నారు.

అయితే కథ ఎప్పుడూ ఒకేలా సాగదుగా! ఇటీవల వచ్చిన ఒక భారీ వర్షం, గాలుల తుఫాను మనోడి  అండర్‌గ్రౌండ్ స్వర్గాన్ని  కాస్తా  స్విమ్మింగ్ పూల్ గా మార్చేసింది. పైన ఉన్న తార్పాలిన్ పరదా ఎగిరిపోవడంతో, భూమి లోపలికి నీళ్లు చేరి ఇల్లంతా జలమయమైంది. ఆ వర్షం నీటిలో మనోడు మునిగి తేలుతున్న వీడియోను కూడా షేర్ చేయడంతో..  పాపం.. ప్రకృతి కూడా ఇతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు  అని నెటిజన్లు  సెటైర్లు వేస్తున్నారు. 

  కొంతమంది ఇతని ఐడియాను, కష్టపడే తత్వాన్ని చూసి  హ్యాట్సాఫ్ రా చారీ అంటుంటే.. మరికొందరైతే  సామీ! ఆ చిన్న గుహలో పొయ్యి వెలిగిస్తే పొగతో ఊపిరి ఆడక చస్తావు, ఇంకొంతమందికి చూస్తుంటేనే  భయం వస్తోంది  అని భయపడిపోతున్నారు. ఏది ఏమైనా,  అమ్మానాన్న ఇంట్లోంచి వెళ్లగొడితే మనం రోడ్డున పడతాం.. కానీ ఈ అర్జున్ గాడు మాత్రం డైరెక్ట్‌గా అండర్ గ్రౌండ్ కు వెళ్లాడంటూ అంటూ ఈ వైరల్ కుర్రాడిపై మీమ్స్, కామెడీ కామెంట్ల వర్షం కురుస్తోంది! 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Jhabua Man Builds Underground House: తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
తల్లిదండ్రుల ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంటే అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు - నిజంగా అండర్ గ్రౌండ్‌కే !
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget