Hyderabad Crime News: సంక్రాంతి రోజు నార్సింగిలో జంట హత్యల కలకలం- యువతి, యువకుడిపై అంత పగ ఎవరికో?
Hyderabad Double Murder | హైదరాబాద్ శివార్లలో సంక్రాంతి పండుగ నాడు విషాదం చోటుచేసుకుంది. ఓ యువతి, యువకుడ్ని కత్తులతో పొడిచి, ఆపై బండరాయితో మోది హత్య చేయడం కలకలం రేపుతోంది.
Narsingi Double Murder | హైదరాబాద్: సంక్రాంతి పండుగ నాడు జంట హత్యలు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీ స్టేషన్ పరిధిలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై ఓ యువతి, యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. సన్ రైజ్ చూసేందుకు ఉదయం వెళ్లిన వారికి ఈ దారుణం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా విషయం వెలుగు చూసింది.
అసలేం జరిగిందంటే..
నార్సింగి పీఎస్ పరధిలోని పుప్పాలగూడలో మంగళవారం ఉదయం గాలి పటాలు ఎగురవేసేందుకు కొందరు వెళ్లారు. పద్మనాభ స్వామి ఆలయం సమీపంలో గుట్టపై ఓ యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి. కత్తులతో పొడిచి, బండ రాళ్లతో మోదీ దారుణంగా వారిని హత్య చేసినట్లు వారు గుర్తించారు. 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని పోలీసులు పరీశీలించారు. మొదట యువతిని హత్య చేసి, ఆపై యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా అని భావించినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు ఆధారాలు సేకరించాయని పేర్కొన్నారు.
ఆ యువతి, యువకుడ్ని కత్తులతో పొడిచి, ఆపై బండరాయితో మోది హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతానికి దూరంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. మరోవైపు హత్యకు గురైన వారు ధరించిన దుస్తులు, షూస్ ను పరిశీలిస్తే వీరు భవన నిర్మాణ కార్మికులు అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని రాజేంద్రనగర్ డీజీపీ అన్నారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరారు.
Also Read: Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..