Jallikattu: చిత్తూరు జిల్లాలో జల్లికట్టు జోష్, ఎద్దులు రంకెలేసి దూసుకొస్తున్నా తగ్గేదేలే అంటున్న యువత
Chittoor Jallikattu Event | ఎద్దులు దూసుకొస్తుంటే వాటి కొమ్ములు వంచేందుకు యువత పోటీ పడుతున్నారు. సంక్రాంతి పండుగ నాడు చిత్తూరు జిల్లాలో ఎటుచూసినా జల్లికట్టు జోష్ కనిపిస్తోంది.
Makar Sankranti 2025 | చంద్రగిరి: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా కోడి పందేలు జరుగుతుంటే, ఉమ్మడి చిత్తూరు జిల్లా మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సహా ఇతర జిల్లాల్లో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. వేలు, లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ప్రైజ్ మనీ ప్రకటించి భారీ ఎత్తున పందేల బరులు ఏర్పాటు చేస్తారు. కానీ అందుకు భిన్నంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో జల్లికట్టు పోటీలు ఫేమస్. ఈ జిల్లాల్లో జల్లికట్టు నిర్వహణకు ఆసక్తి చూపుతారు.
ఇటు కోడి పందేలు, అటు జల్లికట్టు
ఆత్రేయపురంలో పడవ పోటీలను సైతం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పందుల పోటీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీ నిర్వహించడం భారీగా క్యాష్ ప్రైజ్ ప్రకటించారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పలు చోట్ల జల్లికట్టు నిర్వహించారు. రామచంద్రాపురం మండలంలోని అనుపల్లిలో జల్లికట్టు సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయయాయి. ప్రతి ఏడాది భోగి రోజున (జనవరి 13వ తేదీన) పశువుల పండుగ (Jallikattu) జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి మూడు రోజులపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జల్లికట్టుతో సంబరాలు జరుపుకుంటారు. పలు జిల్లా నుంచి కోడె గిత్తలు జిల్లాకు చేరుకున్నాయి.
జల్లికట్టు చూసేందుకు ఏపీలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుండి చిత్తూరు జిల్లాకు ఆసక్తి ఉన్న వారు భారీగా తరలి వచ్చారు. బరిలో ఉన్న పశువుల కొమ్ములకు దేవతల చిత్రాలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్న పలకలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలో పాటు వైసిపి జెండాలతో ఎద్దులను ఆకర్షణీయంగా అలంకరించారు. కొమ్ములు తిరిగిన ఎద్దుల మెడలు వంచి పోటీలో నెగ్గాలని ఎంతో ఉత్సాహంతో యువత జల్లికట్టు బరిలోకి దిగారు. కొన్నిచోట్ల జల్లికట్టులో అవాంఛనీయ ఘటనలు చోటుకుంటాయి. ఎద్దులను మచ్చిక చేసుకునేందుకు, వాటి కొమ్ములు వంచేందుకు చేసే ప్రయత్నంలో గాయాలపాలవుతుంటారు.
Also Read: Pigs Fighting: సంక్రాంతి వేళ పందుల పందేలు స్పెషల్ - రూ.కోట్లలో బెట్టింగులు, ఎక్కడో తెలుసా?