Ram Charan: ‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ రియాక్షన్... మెగా ఫ్యాన్స్, రివ్యూయర్లు ఏమంటారో చూడాలి
Ram Charan on Game Changer: సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సంక్రాంతి స్పెషల్‌గా వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా భారీగా నెగిటివ్ ప్రచారం జరిగినా, కొందరు కావాలని ఆన్‌లైన్‌లో హెచ్‌డి ప్రింట్‌ని పైరసీ చేసి వదిలినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం ‘గేమ్ చేంజర్’ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. సినిమా చూసిన వారంతా.. నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారిపై మండిపడుతూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఒక మంచి సినిమాను ఎందుకు కిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ.. థియేటర్ల బయట మైక్‌ల పట్టుకున్న వారికి ఇచ్చిపడేస్తున్నారు. సినిమాకు ఈ రూపంలో ఎంత డ్యామేజ్ జరిగినా.. రామ్ చరణ్ మాత్రం చాలా కూల్‌గానే ఉన్నారు.
‘గేమ్ చేంజర్’ రిజల్ట్‌పై రామ్ చరణ్ తాజాగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ... ‘గేమ్ చేంజర్’ సినిమా తన లైఫ్‌లో ఎంత ముఖ్యమైనదో వివరించారు. అయితే ఈ లెటర్‌లో ఎక్కడా ఆయన సినిమాపై కావాలని కొందరు చేస్తున్న నెగిటివ్ ప్రచారం గురించి కానీ, పైరసీ గురించి కానీ ప్రస్తావించకుండా.. చాలా గొప్పగా స్పందించడం విశేషం. ఇంతకీ రామ్ చరణ్ తన పోస్ట్‌లో ఏం చెప్పారంటే...
‘‘ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులు, మీడియా వారికి
ఈ సంక్రాంతికి, గేమ్ చేంజర్ రూపంలో మా కష్టానికి తగ్గ ఫలితం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మూవీ సక్సెస్‌లో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణుల, అలాగే తెరవెనుక పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మీరు నాపై చూపే ప్రేమ, మద్దతు ఎంతో విలువైనది. నా ఈ మైల్ స్టోన్‌లో కీలకమైన పాత్ర పోషించి, మంచి రివ్యూలతో ఎంకరేజ్ చేసిన మీడియా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2025లోకి పాజిటివ్ ఎనర్జీతో అడుగు పెట్టిన సందర్భంగా మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇకపై కూడా మీరు గర్వపడే ప్రదర్శనను కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. ఈ ‘గేమ్ చేంజర్’ సినిమాకు నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నాపై మీరంతా చూపిస్తున్న అన్‌కండీషనల్ లవ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను..’’ అంటూ ‘గేమ్ చేంజర్’ అవకాశం ఇచ్చిన దర్శకుడు శంకర్‌కు ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?
View this post on Instagram
దీనికి ఫ్యాన్స్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘గేమ్ చేంజర్‌లో అప్పన్న లాంటి కల్ట్ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నా’ అని కొందరు, ‘మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.. బంగారం అన్నా నువ్వు’ అని మరికొందరు.. ఇలా రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించిన సినిమా ‘గేమ్ చేంజర్’. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 3 రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.