అన్వేషించండి

Internet Privacy : సోషల్ మీడియాలో మీకు సంబంధించిన ఆ డేటా తీసేయండి.. డిజిటల్​గా సేఫ్​గా ఉండాలంటే ఇదే బెస్ట్

Digital Footprint : డిజిటల్ యుగంలో ఆన్లైన్​లో మీరు ఎలా ఉంటున్నారనేది చాలా ముఖ్యం. మీకు సంబంధించి ఫ్యూచర్​లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ చూసేద్దాం.

Erase Your Digital Footprint : ఈ రోజుల్లో ఆన్‌లైన్ ఉనికి అనేది మన గుర్తింపుగా మారింది. ప్రతి క్లిక్, సెర్చ్, ఫోటో, పోస్ట్.. ఇలా ప్రతీది మన డిజిటల్ ఫుట్‌ప్రింట్​గా మారిపోతున్నాయి. మీరు ఏదైనా క్లిక్ చేసినా.. లైక్ కొట్టినా.. కామెంట్ పెట్టినా.. వాటిని బట్టి పీపుల్స్ జడ్జ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే అలాంటి డిజిటల్ యుగంలో మీకు సంబంధించిన కొన్ని గుర్తులను పూర్తిగా చెరిపేయవచ్చు తెలుసా? మీరు మీ ఆన్​లైన్​ ఉనికి తీసేయాలి లేదా తగ్గించాలనుకుంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అలాంటి వాటిలో టాప్ 5 టిప్స్ ఏంటి? వాటిని ఫాలో అయితే ఇంటర్నెట్​ నుంచి ఆ సమాచారం తీసేయవచ్చా వంటి విషయాలు తెలుసుకుందాం. 

అసలు ఎందుకు వీటిని చేయాలనే ప్రశ్న వస్తే.. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు లేదా మీ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ తరహా కంటెంట్ వస్తే మీరు బ్యాడ్ అయ్యే అవకాశముంది. అవకాశాలు చేజారిపోవచ్చు కూడా. అందుకే డిజిటల్​గా ఉండే నెగిటివిటీని తొలగించుకుంటే మంచిది.

ఓల్డ్ అకౌంట్స్.. 

డిజిటల్​గా మీరు సేఫ్​గా ఉండాలంటే.. ముందు తీసుకోవాల్సిన చర్య ఓల్డ్ అకౌంట్స్ ఏమున్నాయో గుర్తించాలి. అంటే మీ పాత ఇమెయిల్, సోషల్ మీడియా ఖాతాలను ట్రాక్ చేయాలి. అలాగే కొన్నిసార్లు Facebook, Twitter, ఇన్​స్టాగ్రామ్ లేదా ఏదైనా షాపింగ్ సైట్‌లో ఖాతాను తెరిచి మర్చిపోతూ ఉంటాము. ఇటువంటి ఖాతాలు మీ సమాచారాన్ని పూర్తిగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా హ్యాకింగ్‌కు కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. Googleలో మీ పేరు+ఖాతాను సెర్చ్ చేయండి. ఇది చాలా పాత ఖాతాలను చూపుతుంది. ఆపై వాటిని ఒక్కొక్కటిగా తొలగించండి. లేదా డిలీట్ చేయండి. వాటిని డిలేట్ చేయకుంటే మీ సమాచారం ఎవరో ఒకరికి చేరుతూనే ఉంటుంది.

డేటా బ్రోకర్లు

చాలా వెబ్‌సైట్‌లు, డేటా బ్రోకర్లు మీ పేరు, ఇ-మెయిల్, ప్లేస్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని తీసుకుని.. వాటిని విక్రయిస్తారు. ఈ సైట్‌లకు వెళ్లి మీరు డేటా తొలగింపు అభ్యర్థనను పంపవచ్చు. భారతదేశంలో కూడా ఇప్పుడు చాలా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు వారి సమాచారాన్ని తొలగించే అవకాశాన్ని అందిస్తున్నాయి. దీనికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఇది ఒక ముఖ్యమైన చర్య. ఫ్యూచర్​లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

సెర్చ్ ఇంజిన్ల నుంచి.. 

మీ పేరుతో ముడిపడి ఉన్న పాత ఫోటోలు, వార్తలు లేదా పోస్ట్‌లు Google శోధనలో కనిపిస్తే.. మీరు వాటిని “Remove outdated content” సాధనం ద్వారా తొలగించవచ్చు. Google, Bing రెండింటిలోనూ ఈ ఎంపిక అందుబాటులో ఉంది. ఏదైనా వెబ్‌సైట్ మీ అనుమతి లేకుండా కంటెంట్‌ను ప్రచురించినట్లయితే.. మీరు వాటిని తీసేయమని చెప్పగలిగే హక్కు ఉంది. 

సోషల్ మీడియా డీటాక్స్

సోషల్ మీడియా మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్​లో అతిపెద్ద భాగంగా చెప్పవచ్చు. Facebook, Instagram, X (Twitter) లేదా LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లి మీ పాత పోస్ట్‌లు, ఫోటోలు, కామెంట్లను తొలగించండి. మీరు పూర్తిగా అదృశ్యం కావాలనుకుంటే.. ఖాతానుంచి లాగ్ అవుట్ చేయడానికి బదులుగా.. పర్మినెంట్ డిలీట్ ఆప్షన్ ఎంచుకోండి. ఇది మీ డేటాను సర్వర్ నుంచి కూడా తొలగిస్తుంది.

సురక్షితంగా ఉండేందుకు

భవిష్యత్తులో మళ్లీ మీరు ఆన్‌లైన్‌లో కనిపించకుండా ఉండేందుకు మీ డిజిటల్ ప్రవర్తనలో మార్పులు చేయడం అవసరం. కొత్త వెబ్‌సైట్‌లలో అనవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయడం మంచిది కాదు. ఆ సమయంలో మీరు VPNని ఉపయోగించవచ్చు. వ్యక్తిగత ఇమెయిల్స్‌కు బదులుగా డిస్‌పోజబుల్ ఇమెయిల్ IDలతో సైన్ అప్ చేయండి. అలాగే ప్రతి కొన్ని నెలలకు ఒకసారి మీ పేరును Googleలో శోధించడం ద్వారా మీ పాత సమాచారం మళ్లీ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోవచ్చు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hair Oil After Shampoo : తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Glowing Skin Hacks : పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Adilabad Dandari Festival: ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
ఆదిలాబాద్ ఏజెన్సీలో 10 రోజులపాటు ఆదివాసీల దండారీ వేడుకలు.. గుస్సాడి నృత్యాలు
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
AP Fire Accidents: ఒకేరోజు పలుచోట్ల అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు ఆరా, అధికారులకు ఆదేశాలు
Tesla Cybertruck: భారీ అంచనాలతో వచ్చిన సైబర్‌ట్రక్‌కు టాటా.. 2027లో ఉత్పత్తి నిలిపివేయనున్న టెస్లా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. కొనేవాళ్లు లేక టెస్లా సంచలన నిర్ణయం!
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Embed widget