Online Study vs Book Study : పిల్లలకు ఆన్లైన్ స్టడీ మంచిదా? టెక్ట్స్ బుక్ చదువు మంచిదా? లాభాలు, నష్టాలు ఇవే
Online vs Offline Education : ఆన్లైన్లో చదివితే మంచిదా? పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి బుక్ స్టడీ హెల్ప్ చేస్తుందా? అసలు వీటివల్ల లాభాలు ఏంటి? నష్టాలు ఏంటి?

Online Study or Studying from Books : కరోనా ఎఫెక్ట్ వల్ల ఆన్లైన్ స్టడీ అనేది స్కూల్స్‌లో కూడా ఓ భాగమైపోయింది. గతంలో పిల్లలు ఫోన్స్ చూస్తే వద్దని చెప్పిన తల్లిదండ్రులే ఇప్పుడు ఫోన్స్, ట్యాబ్స్ ఇచ్చి చదువుకోమని చెప్తున్నారు. ఇలా చదువులో ఆన్లైన్ స్టడీ ఓ భాగమై పోయింది. అయితే దీనివల్ల లాభముందా? బుక్స్‌లో చదివితే మంచిదా? ఆన్లైన్ స్టడీవల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటి? బుక్స్‌తో చదివితే ఉండే బెనిఫిట్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఆన్లైన్ స్టడీతో లాభాలు
వీడియోలు, క్విజ్లు, యానిమేషన్స్తో టాపిక్‌ని క్రియేట్ చేస్తారు కాబట్టి దానిని చూస్తూ త్వరగా అర్థం చేసుకునే అవకాశముంది. ఆన్లైన్ కోర్స్‌లు త్వరగా అప్డేట్ అవుతాయి. ప్రింటెడ్ బుక్‌లో రివైడ్జ్ కంటెంట్ రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆన్లైన్లో ఇలాంటి ఇబ్బందులుండవు. ఎప్పుడైనా, ఎక్కడైనుంచైనా నేర్చుకునే అవకాశముంటుంది. కావాల్సిన టాపిక్స్‌ని ఈజీగా పిక్ చేసుకునే సౌలభ్యం.. దానికి సబంధించిన రిఫరెన్స్‌లు ఈజీగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఎక్కువ సమయం కలిసి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ని ఆన్లైన్లో పొందవచ్చు.
ఆన్లైన్ చదువుతో కలిగే ఇబ్బందులు
సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఈజీగా ఫోకస్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల తలనొప్పి, కంటి సమస్యలు పెరుగుతాయి. నెట్వర్క్ లేకుంటే చదువుకోవడం కష్టమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ కంటెంట్ ఈజీ మెథడ్స్‌ని ఇస్తుంది. దీనివల్ల ఆ టాపిక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకపోవచ్చు.
బుక్స్ చదివితే కలిగే లాభాలు..
బుక్స్‌తో చదువుకున్నప్పుడు ఎలాంటి అంతరాయాలు ఉండవు. కాబట్టి చదువుపై ఫోకస్ పెరుగుతుంది. ఏకాగ్రతతో చదివినప్పుడు టాపిక్‌ని అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మైండ్ స్వతాహాగా విజువలైజేషన్ చేస్తుంది. ఇంటర్నెట్ సమస్యలు ఉండవు. అవసరమైన టాపిక్‌ని నెట్ ఉన్నా లేకున్నా.. ఫోన్ ఉన్నా లేకున్నా చదువుకునే వీలు ఉంటుంది.
నేరుగా చదివితే కలిగే నష్టాలు
వీడియో ఎక్స్ప్లనేషన్స్ ఉండవు కాబట్టి.. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ఒకరు చెప్పింది మీకు అర్థం కాకుంటే పూర్తి సమాచారం తెలుసుకోవడం కష్టమవుతుంది. ప్రింటెడ్ బుక్స్ అప్డేట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. బుక్స్ మోసుకెళ్లడం, తీసుకురావడం కష్టంగా ఉండొచ్చు.
ఆన్లైన్ స్టడీ మంచిదా? ఆఫ్‌లైన్ స్టడీనా?
ఆన్‌లైన్‌ని, ఆఫ్లైన్ని బ్లెండ్ చేసి చదువుకుంటే మంచిది. ఎందుకంటే పరిస్థితులను బట్టి టాపిక్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ని బట్టి రిఫరెన్స్‌లు తీసుకునేందుకు రెండూ కలిపి ట్రై చేయవచ్చు. దీనివల్ల ఎక్కువ సమాచారాన్ని సులువుగా నేర్చుకునే సౌలభ్యం ఉంది. ఏకాగ్రతతో చదవాలి అనుకున్నప్పుడు బుక్స్ ఎంచుకోవచ్చు. రివిజన్కోసం, అప్డేట్ టాపిక్స్ నేర్చుకోవడం కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ చూడొచ్చు. మీరు నేర్చుకునే విధానం, గోల్స్, మీకున్న రీసోర్స్‌ల బట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు.






















