పిల్లలు బాగా చదవాలంటే పేరెంట్స్ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటి అనుకుంటున్నారా?

కిడ్స్ చదువుకోవడానికి ప్రశాంతంగా, కంఫర్ట్​బుల్​గా, ఇబ్బందిలేని స్టడీ సమయాన్ని ఇవ్వాలి.

స్క్రీన్ టైమ్ తగ్గించాలి. పిల్లలు ఉన్నరూమ్​లో ఉంటే మొబైల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయాలి. దీనివల్ల ఫోకస్ పెరుగుతుంది.

పిల్లలు చదువుకోవడానికి వీలుగా టెక్స్ట్​ బుక్స్, స్టేషనరీ, డిజిటల్ టూల్స్ ప్రొవైడ్ చేయాలి.

చదువుకోవడానికి వీలుగా స్టడీ షెడ్యూల్ చేసి ఇవ్వొచ్చు. ఇది వారు చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది.

సింపుల్ ట్రిక్స్ నేర్పించడం.. పెద్దగా ఉండేవాటిని ఎలా సింప్లిఫై చేసి చదవచ్చో నేర్పించాలి.

కేవలం చదువే కాకుండా రెగ్యులర్ బ్రేక్స్ ఇవ్వాలి. ఇది వారి బ్రెయిన్ మీద ప్రెజర్ తగ్గిస్తుంది.

మార్క్స్​ని బట్టి జడ్జ్ చేయకుండా.. పిల్లలు పెట్టే ఎఫర్ట్స్​ని మెచ్చుకోవాలి.

పిల్లలు ఫెయిల్ అయితే డల్ అవ్వకుండా.. మరోసారి ఎలా ట్రై చేయవచ్చో.. చెప్పి మోటివేషన్ ఇవ్వాలి.

పిల్లలు చదువుకున్నా.. మీరు ఇచ్చిన అసైన్​మెంట్ పూర్తి చేసినా.. వారికి చిన్నపాటి గిఫ్ట్స్, కాంప్లిమెంట్స్ ఇవ్వాలి.