Indian Women Cricket team gesture: ఆడ పిల్లలు కదా... అలాగే ఉంటారు.. దక్షిణాఫ్రికా ప్లేయర్లను ఓదార్చి మనసులు గెలిచిన మన అమ్మాయిలు
వరల్డ్‌కప్‌లో మన అమ్మాయిలు ఆటనే కాదు.. హృదయాలను కూడా గెలిచారు. ఫైనల్‌లో భారత్ చరిత్ర సృష్టించిన తర్వాత స్మృతి మంధానా, జెమిమా రోడ్రిగ్స్,దీప్తి శర్మ చేసిన పని అసలైన స్పోర్ట్స్ స్పిరిట్‌ను చాటింది.

Smrithi Mandhana& Jemimah Gesture: 40 ఏళ్ల తర్వాత తీరిన కల.. ప్రపంచకప్‌ను గెలిచిన.. సంబరాల్లో మునిగిపోతున్న సందర్భం.. అంతటి ఉద్విఘ్న క్షణాల్లోనూ మన అమ్మాయిలు ప్రత్యర్థులను ఓదార్చారు. విజయం అంటే విజయం అంటే కేవలం ట్రోఫీ లిఫ్ట్ చేయడం కాదు బాస్... హృదయాలను గెలవడమే అసలు గేమ్! అని నిరూపించారు.
ఎమోషన్స్ ఓవర్‌బోర్డ్..
దక్షిణాఫ్రికా చివరి వికెట్ నేలకూలిన ఆ క్షణం భారతావని మొత్తం మారుమోగిపోయింది. వేలాది మంది ప్రత్యక్షంగా కోట్లాది మంది టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మైదానంలో ఉన్న వారి పరిస్థితి చెప్పేదేమంది. వాళ్లంతా ఓ ట్రాన్స్‌లో ఉన్నారు. ఇన్నాళ్ల తమ కష్టం ఫలించిందన్న అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంతటి ఉద్విఘ్న క్షణాల్లోనూ.. మన ప్లేయర్‌లు.. Smriti Mandhana, Jemimah Rodrigues, Deepthi Sharma ప్రత్యర్థి ప్లేయర్ల దగ్గరకు వెళ్లారు. ఓటమి బాధలో ఉన్న వాళ్లని ఓదార్చారు. దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. ఎవరో విన్నర్-లూజర్‌లు కాదు, మనమంతా ప్లేయర్స్ అని గుర్తు చేసిన క్షణం అది.. ఈ దృశ్యాలను కెమెరామెన్లు బంధించగా..ICC తన సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో పెట్టింది. మన వాళ్లు “You played awesome, this isn’t the end” అన్నట్లు ఉన్న ఆ ఎమోషనల్ మోమెంట్ నెట్‌లో వైరల్ అయింది. క్రికెట్ ఫ్యాన్స్, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పేజీలు అంతా ఈ వీడియోని షేర్ చేస్తూ “ఇదే మన ఇండియా వైబ్!” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో ఫుల్ ఫైర్
ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్ షార్ట్‌లలో ఇదే టాపిక్. “Smriti & Jemimah just melted hearts ”, “More power to our queens ”, “Winning hearts before trophies” అంటూ రియాక్షన్లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.“World Cup trophy may fade with time, but this moment will trend forever!” అని ఓ యూజర్ రాయగా... ' నేను ఇండియా జట్టును లవ్ చేయడానికి ఇదే రీజన్' అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
సౌతాఫ్రికా కెప్టెన్ రియాక్షన్
మ్యాచ్ తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ Laura wolvaardt కూడా ఎమోషనల్‌గా స్పందించింది “ఇండియా deserved this win" అని చెప్పింది. అమ్మాయిల ఆట అంటే ఎవ్వరూ పట్టించుకోని రోజుల నుంచి నేడు విశ్వవిజేతగా నిలిచే వరకూ ఇండియన్ విమెన్ టీమ్స్ అనేక అవరోధాలను దాటుకుంటూ వచ్చాయి. రెండు సార్లు ఫైనల్కు చేరినా గెలవలేకపోయారు. కొన్నాళ్లుగా మహిళా క్రికెట్కు ఆదరణ పెంచడంలో చాలా మంది క్రీడాకారిణిల కృషి ఉంది. ఇప్పుడు ఈ టీమ్ దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లింది.విమెన్ క్రికెట్కు ఓ స్టార్డమ్ను తీసుకొచ్చింది. తమ ఆటతో మన టీమ్కు , క్రికెట్కు గౌరవాన్ని తచ్చిన అమ్మాయిలు..గేమ్ బయట కూడా తమ నడతతో దానిని మరింత ఇనుమడింపజేశారు. Humanity is the Part of the game అని చాటారు.




















