Rohit Sharma Emotional | Women ODI World Cup 2025 | ఎమోషనల్ అయిన రోహిత్
ఇండియా విమెన్ టీమ్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన క్షణాల్లో అందరు భావోద్వేగానికి గురైయ్యారు. ప్లేయర్స్ తోపాటు స్టేడియంలో ఉన్న ప్రతిఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు. 47 ఏళ్ల తర్వాత భారత్ కప్ ను సొంతం చేసుకోవడంతో మాజీ మహిళ క్రికెటర్ల ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన రోహిత్ శర్మ కూడా ప్లేయర్లు సంబరాలు చూస్తూ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు.
మ్యాచ్ మొదటి బాల్ నుంచే రోహిత్ శర్మ స్టాండ్స్ లో నుంచి టీమ్ఇండియాను చీర్ చేస్తూ వచ్చాడు. ఇక మ్యాచ్‌ను భారత్ గెలవగానే రోహిత్ సంతోషంలో చప్పట్లు కొడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విన్నింగ్ మూమెంట్‌కు ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా 2023 వరల్డ్ కప్ ను గుర్తు చేసుకుంటున్నారు.
2023 పురుషుల వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయింది. దీంతో రోహిత్, విరాట్ తోపాటు ఫ్యాన్స్ హర్ట్ కూడా బ్రేక్ అయ్యింది. ఇప్పుడు ఇలా మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్ నెగ్గడంతో రోహిత్ ఎమోషనల్ అవడంపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఎవరు సాధిస్తే ఏంటి వన్డే వరల్డ్ కప్ భారత్ దే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. .





















