(Source: ECI | ABP NEWS)
New Tata Altroz కొనాలా, వద్దా? - కొత్త ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌పై ప్లస్‌లు, మైనస్‌లతో పూర్తి విశ్లేషణ
2025 Tata Altroz Facelift కొత్త స్టైలింగ్, ఫీచర్లతో వచ్చింది. కానీ కొనడానికి ఇది సరైనదేనా? - 4 కొనదగ్గ కారణాలు, 3 మిస్ చేయదగ్గ కారణాలు ఈ కథనంలో ఉన్నాయి.

2025 Tata Altroz Facelift Review: టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. 2025 మే నెలలో విడుదలైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్ షార్ప్‌గా, ఇంటీరియర్ ప్రీమియంగా, ఫీచర్లు ఆధునికంగా మారాయి. కానీ ఈ కొత్త వెర్షన్ నిజంగా విలువైనదా? లేక దీని పోటీ కార్లు బెటరా?. టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 4 ప్లస్‌లు, 3 మైనస్‌లు ఇవిగో...
కొనదగ్గ కారణాలు
1. దేశంలో ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్
టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం భారత మార్కెట్లో లభించే ఏకైక డీజిల్ హ్యాచ్‌బ్యాక్. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 90 హెచ్‌పీ శక్తిని, 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. ఈ శక్తిమంతమైన ఇంజిన్ హైవేపై డ్రైవ్ చేస్తే టార్కీగా, తేలికగా సాగుతుంది. ముఖ్యంగా, ఈ డీజిల్ ఇంజిన్‌కు DEF (యూరియా లిక్విడ్) అవసరం లేదు. కాబట్టి దీర్ఘకాలం నిర్వహణ ఖర్చు తక్కువగానే ఉంటుంది.
2. అద్భుతమైన రైడ్ కంఫర్ట్
ఆల్ట్రోజ్ రోడ్డుపై కంఫర్ట్‌లో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుంది. సస్పెన్షన్ బలంగా, అదే సమయంలో మృదువుగా ఉంటుంది. గుంతలు, రోడ్ అప్-డౌన్‌లను సులభంగా హ్యాండిల్ చేస్తుంది. సిటీ డ్రైవింగ్‌లోనూ, హైవేపై లాంగ్ ట్రిప్స్‌లోనూ డ్రైవర్‌కు & ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
3. స్పేస్ & ప్రాక్టికాలిటీ
ఇంటీరియర్‌లో సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఫ్రంట్, రియర్ సీట్లలో అండర్ థై సపోర్ట్ బాగా ఇస్తుంది. బూట్ స్పేస్ 345 లీటర్లు (పెట్రోల్, డీజిల్) లభిస్తుంది. Tata Altroz CNG వేరియంట్‌లో రెండు 60-లీటర్ సిలిండర్లు బూట్ కింద అమర్చారు, కాబట్టి లగేజ్ స్పేస్ (210 లీటర్లు) కూడా ఉపయోగపడేలా ఉంది.
4. ఫీచర్ల పరంగా లీడర్
కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హార్మన్ కార్డన్ సౌండ్, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కంట్రోల్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఆల్ట్రోజ్‌ను ప్రీమియంగా నిలబెడతాయి.
ఇప్పుడు, కొంచెం ఆలోచించాల్సిన అంశాలు చూద్దాం
1. పనితీరు అంతంతమాత్రమే
ఆల్ట్రోజ్ 1.2 లీటర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ 88 హెచ్‌పీ శక్తి ఇస్తుంది. కానీ హ్యుందాయ్ i20 లాంటి టర్బో పెట్రోల్ రైవల్స్‌తో పోలిస్తే ఇది అంత స్పీడీగా అనిపించదు. స్పోర్టీ డ్రైవ్ కోరుకునే వారికి ఇది కొంచెం ఫ్లాట్‌గా అనిపించవచ్చు.
2. రిఫైన్‌మెంట్ లోపం
రోడ్, గాలి, ఇంజిన్ శబ్దాలు కేబిన్‌లోకి కొంతమేరకు వస్తాయి. హైవేపై 80 kmph పైగా వెళ్తే విండ్ నాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. డీజిల్ వేరియంట్‌లో ఇంజిన్ సౌండ్ కూడా కాస్త గట్టిగా ఉంటుంది.
3. రియర్ హెడ్‌రూమ్ తక్కువ
పొడవైన ప్రయాణికులు (6 అడుగులు & అంతకు పైగా) వెనుక సీటులో కూర్చుంటే తల రూఫ్‌కి దగ్గరగా అనిపిస్తుంది. మారుతి బాలెనో, హ్యుందాయ్ i20 వంటి కార్లు ఈ విషయంలో కాస్త బెటర్‌గా ఉంటాయి.
మొత్తంగా చూస్తే, టాటా ఆల్ట్రోజ్ ఒక బలమైన, సేఫ్ & ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్. డీజిల్ లేదా CNG వేరియంట్ కోసం చూస్తున్న వారికి ఇది చక్కని ఆప్షన్. అయితే ఎక్కువ స్పీడ్ డ్రైవింగ్, లేదా టర్బో ఫన్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు.
ఎక్స్-షోరూమ్ ధర: ₹6.30 లక్షల నుంచి (హైదరాబాద్, విజయవాడ). నగరాన్ని బట్టి ధర కొద్దిగా మారవచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















