అన్వేషించండి

FASTag షాక్‌, KYV చేయకపోతే టోల్‌ గేట్‌ దగ్గర డబుల్‌ అమౌంట్‌ కట్టాలి - డ్రైవర్లకు కొత్త టెన్షన్‌

FASTag New Rule: అక్టోబర్‌ 31 నుంచి KYV వెరిఫికేషన్‌ చేయని వాహన యజమానుల FASTagలు నిలిచిపోయాయి. టోల్‌ వద్ద క్యాష్‌లోనే చెల్లించాల్సి వస్తోంది. NHAI కొత్త రూల్‌ డ్రైవర్లను గందరగోళంలోకి నెట్టింది.

FASTag KYV Verification: అక్టోబర్‌ 31 తరువాత మీ FASTag పని చేయడం ఆగిపోయి ఉండవచ్చు, చెక్‌ చేసుకోండి. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా డ్రైవర్లలో టెన్షన్‌ కలిగిస్తున్న కొత్త విషయం. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) తాజాగా తీసుకున్న “Know Your Vehicle (KYV)” వెరిఫికేషన్‌ నియమం అందరినీ అలజడికి గురి చేస్తోంది.

కొత్త నియమం ఏంటి?
అక్టోబర్‌ 31 తరువాత, ప్రతి వాహన యజమాని తన FASTag కొనసాగించాలంటే KYV వెరిఫికేషన్‌ తప్పనిసరి. మీరు అక్టోబర్‌ 31 లోపు ఈల పనిని పూర్తి చేసి ఉండకపోతే, మీ FASTag ఆటోమేటిక్‌గా డిసేబుల్‌ అవుతుంది. ఈ విషయం తెలీక మీరు హైవే ఎక్కినప్పుడు టోల్‌ వద్ద FASTag పని చేయదు, దాదాపు రెట్టింపు మొత్తాన్ని క్యాష్‌లో చెల్లించాల్సి వస్తుంది.

ఎందుకు KYV అవసరం?
NHAI తెలిపిన వివరాల ప్రకారం, చాలామంది ఒకే FASTag ని ఒకటి కంటే ఎక్కువ వాహనాల్లో ఉపయోగించడం, వాహనానికి సంబంధించిన వివరాలు తప్పుగా లింక్‌ చేయడం, లేదా వాహనాల రకాలను మార్చి తక్కువ టోల్‌ చెల్లించడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను అరికట్టేందుకే KYV వెరిఫికేషన్‌ ప్రారంభమైంది.

ఏ డాక్యుమెంట్లు అవసరం?
వాహనం RC బుక్‌, యజమాని పేరు స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఆధార్‌, పాన్‌ లేదా పాస్‌పోర్ట్‌ కాపీ అప్‌లోడ్‌ చేయాలి. కొన్ని వాహనాలకు వాహనం ముందు వైపు, సైడ్‌, ఛాసిస్‌ కూడా కనిపించేలా ఫోటోలు తీయాలి. ఈ ప్రాసెస్‌ను బ్యాంక్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా చేయవచ్చు.

KYV ఎలా చేయాలి?
FASTag ఇచ్చిన బ్యాంక్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో లాగిన్‌ అయి ‘Know Your Vehicle’ లేదా ‘Update KYV’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయాలి. డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి, OTP వెరిఫికేషన్‌ పూర్తి చేసిన తర్వాత మీ ట్యాగ్‌ “Active and Verified”గా చూపిస్తుంది.

KYV చేయకపోతే ఏమవుతుంది?
KYV పూర్తి చేయని లేదా పాక్షికంగా వెరిఫై అయిన FASTagలు ఇప్పటికే (అక్టోబర్‌ 31 తరువాత) ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్‌ అయ్యాయి. బ్యాలెన్స్‌ ఉన్నా కూడా ఆ FASTag పని చేయదు. ఈ విషయం తెలీక హైవే ఎక్కిన డ్రైవర్లు టోల్‌ ప్లాజా వద్ద ఇబ్బందులు పడినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

KYV వల్ల లాభాలేమిటి?
NHAI ప్రకారం, ఈ కొత్త సిస్టమ్‌ వాహనాల దుర్వినియోగం ఆగుతుంది, చోరీ అయిన లేదా అమ్మిన వాహనాలను ట్రాక్‌ చేయడంలో సులభంగా మారుతుంది, టోల్‌ క్యాటగిరీలలో తప్పులు తగ్గుతాయి & వినియోగదారులకు పారదర్శక డేటా అందుబాటులో ఉంటుంది.

ప్రజల స్పందన?
చాలా మంది డ్రైవర్లు మాత్రం ఈ ప్రక్రియను కొత్త తలనొప్పిగా చూస్తున్నారు. “KYCలాగే మరో ఫార్మాలిటీ ఇది,” అని చాలామంది సోషల్‌ మీడియాలో వాపోతున్నారు. అయితే, FASTag ఆగిపోతే టోల్‌ వద్ద క్యాష్‌ క్యూలలో నిలబడాల్సి వస్తుందనే భయంతో, KYV పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారు. 

మొత్తం మీద, FASTag వ్యవస్థను ప్రక్షాళన చేయడం, దుర్వినియోగాన్ని అరికట్టడం & భవిష్యత్తులో టోల్‌ చెల్లింపులను మరింత పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా ఈ కొత్త నియమం వచ్చింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget