అన్వేషించండి

చిన్న సైజ్‌ కారు తరహా పవర్‌ ఇచ్చే స్కూటర్లు - ఇండియాలో మోస్ట్‌ పవర్‌ఫుల్‌ స్కూటర్లు ఇవే

భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన పెట్రోల్ స్కూటర్లు ఏవి? Aprilia, Yamaha, Hero, BMW, Honda బ్రాండ్ల నుంచి వచ్చిన టాప్ 5 పవర్‌ఫుల్ స్కూటర్ల పూర్తి వివరాలు.

Most Powerful Petrol Scooters India 2026: ఇప్పటివరకు స్కూటర్లు అంటే చాలా మందికి సాధారణంగా ఆఫీస్‌కు వెళ్లడానికి లేదా చిన్న ప్రయాణాలకు ఉపయోగించే వాహనాలే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్లో పెర్ఫార్మెన్స్‌ మీద దృష్టి పెట్టిన శక్తిమంతమైన స్కూటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

Aprilia, Yamaha, Hero, BMW, Honda వంటి బ్రాండ్లు ఇప్పుడు ఎక్కువ పవర్, మంచి టాప్ స్పీడ్, ఆధునిక ఫీచర్లతో స్కూటర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో అమ్మకాల్లో ఉన్న అత్యంత శక్తిమంతమైన పెట్రోల్ స్కూటర్లు ఏవో ఇప్పుడు చదివేద్దాం.

5. Aprilia SR 175 hp e - 13.3 hp

Aprilia SR 175 hp e స్కూటర్‌లో 174.7cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ 13.3hp పవర్, 14Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ స్కూటర్‌లో...

14 ఇంచ్ వీల్స్

సింగిల్ ఛానల్ ABS

కలర్ TFT డిస్‌ప్లే

బ్లూటూత్ కనెక్టివిటీ

లాంటివి ఉన్నాయి. RS 457, Tuono 457 బైక్‌లలో కనిపించే అదే కలర్ TFT స్క్రీన్ ఇందులో కూడా ఉంటుంది. కాల్ అలర్ట్స్, నోటిఫికేషన్స్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మైలేజ్ విషయంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. హైవేపై సుమారు 41.7 kmpl, నగరంలో 35.2 kmpl వరకు ఇస్తుంది.

4. Hero Xoom 160 - 14.8 hp

Hero కంపెనీ నుంచి వచ్చిన మొదటి మ్యాక్సీ స్కూటర్ Hero Xoom 160. ఇందులో 156cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది.

ఈ ఇంజిన్‌...

14.8hp పవర్

14Nm టార్క్

ఇస్తుంది. ఇందులో i3S స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఈ స్కూటర్ బరువు సుమారు 142 కిలోలు ఉంటుంది.

ఈ స్కూటర్ టాప్ స్పీడ్ సుమారు 110 నుంచి 120 kmph వరకు ఉంటుంది. పవర్ డెలివరీ స్మూత్‌గా ఉండటం దీని ప్రత్యేకత.

3. Yamaha Aerox 155 - 15 hp

పర్ఫార్మెన్స్ స్కూటర్లలో Yamaha Aerox 155 చాలా పాపులర్. ఇందులో 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇదే ఇంజిన్‌ Yamaha R15 బైక్‌లో కూడా ఉపయోగిస్తారు.

ఈ ఇంజిన్‌...

15hp పవర్

13.9Nm టార్క్

ఇస్తుంది. అలాగే Variable Valve Actuation (VVA) టెక్నాలజీ ఉంటుంది. Aerox బరువు సుమారు 126 కిలోలు మాత్రమే ఉండటం వల్ల పవర్ టు వెయిట్ రేషియో చాలా మంచి స్థాయిలో ఉంటుంది.

జాగ్రత్తగా నడిపితే 40 నుంచి 45 kmpl వరకు మైలేజ్ కూడా ఇవ్వగలదు.

2. BMW C 400 GT - 34 hp

BMW నుంచి వచ్చిన C 400 GT మ్యాక్సీ స్కూటర్ నిజంగా ప్రీమియం వాహనం. ఇందులో 350cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది.

ఈ ఇంజిన్‌...

34hp పవర్

35Nm టార్క్

ఉత్పత్తి చేస్తుంది. BMW ప్రకారం ఈ స్కూటర్ 0 నుంచి 100 kmph వేగాన్ని 10 సెకన్లలోపు చేరుకుంటుంది. అంటే, చిన్న కార్లతో పోటీగా, చాలా వేగంగా 100 kmph స్పీడ్‌ను అందుకోగలదు. ఈ బండి టాప్ స్పీడ్ 139 kmph వరకు ఉంటుంది.

ఇందులో...

10.25 ఇంచ్ TFT డిస్‌ప్లే

ట్రాక్షన్ కంట్రోల్

కార్నరింగ్ ABS

రైడ్ మోడ్స్

వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ ధర సుమారు రూ.11.50 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

1. Honda X ADV - 58.6 hp

ఇండియాలో అమ్మకాల్లో ఉన్న అత్యంత శక్తిమంతమైన స్కూటర్ Honda X ADV. ఇందులో 745cc ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది.

ఈ ఇంజిన్‌...

58.6hp పవర్

69Nm టార్క్

ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక చిన్న సైజ్‌ ఇచ్చే పవర్‌కు దాదాపు సమానం. ఇందులో 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. క్లచ్ లీవర్ లేదా గేర్ లీవర్ లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

ఈ స్కూటర్

17 ఇంచ్ ఫ్రంట్ వీల్

15 ఇంచ్ రియర్ వీల్

అడ్వెంచర్ స్టైల్ డిజైన్

ఉంటాయి. బరువు సుమారు 237 కిలోలు అయినా కూడా ఇది మిడ్‌సైజ్‌ బైక్‌ల స్థాయి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.13.5 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

ఇతర స్కూటర్లు

Keeway Sixties 300i & Keeway Vieste 300 స్కూటర్లు కూడా శక్తిమంతమైనవే. వీటిలో 278.2cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 19hp పవర్ ఇస్తుంది. అయితే ఇండియాలో Keeway డీలర్ నెట్‌వర్క్ చాలా పరిమితంగా ఉండటం వల్ల ఈ స్కూటర్లు ప్రధాన జాబితాలో చోటు పొందలేదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget