అన్వేషించండి

FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?

FASTag Annual Pass, Local Pass, Regular Recharge మధ్య ధర, అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి. మీ ప్రయాణానికి ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదో చూడండి.

FASTag Annual Pass vs FASTag Local Pass: హైవేలపై తరచూ ప్రయాణించేవాళ్లకు ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ మంచి ఆదా మార్గంగా మారవచ్చు. అయితే ఈ పాస్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందని చెప్పలేం. రోజూ ఒకే టోల్ ప్లాజా దాటుతూ కార్యాలయానికి వెళ్లేవారికి ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఎక్కువ ప్రయోజనం ఇవ్వొచ్చు. అప్పుడప్పుడు మాత్రమే హైవేపై ప్రయాణించే వారికి సాధారణ ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ సరిపోతుంది.

2026 నవంబర్ 1 నుంచి, టోల్ ప్లాజాల పరిసరాల్లో నివసించే అర్హులైన వాహనదారులకు రాయితీ FASTag Local Pass అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న రూ.3,075 విలువైన FASTag Annual Passకు ఇది అదనపు ఆప్షన్. అయితే ఈ రెండు పాస్‌ల ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకటి ఎంపిక చేసిన జాతీయ రహదారులపై ప్రయాణాలకు ఉపయోగపడితే, మరొకటి నిర్దిష్ట టోల్ ప్లాజా వద్ద మాత్రమే వర్తిస్తుంది.

ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌ - తేడాలు

Regular FASTag Recharge: మీరు దాటే ప్రతి టోల్ ప్లాజా వద్ద వర్తించే ఛార్జీ మీ FASTag బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. ముందుగా నిర్ణయించిన వార్షిక రుసుము ఉండదు.

FASTag Annual Pass: 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ పాస్ ధర రూ.3,075. అర్హత ఉన్న National Highways & National Expresswaysపై గరిష్ఠంగా 200 క్రాసింగ్‌లు లేదా 12 నెలల పాటు వర్తిస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో పాస్ గడువు ముగుస్తుంది.

Local FASTag Pass: టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన ప్రైవేట్ వాహన యజమానులు ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధికి బయట ఉన్న టోల్ ప్లాజాకు ఏడాదికి రూ.1,500, ఆ పరిధిలో ఉన్న ప్లాజాకు రూ.3,000 చెల్లించాలి. ఈ పాస్ ఆ నిర్దిష్ట టోల్ ప్లాజా వద్ద మాత్రమే పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: E20, E100, B100 ఇంధనాలపై కేంద్రం కొత్త నిబంధనలు.. మారుతి WagonR Flex Fuel ప్రత్యేకతలివే!

 1. రూ.3,075 FASTag Annual Pass.. ఎవరికి ఉపయోగం?

తరచూ ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే వారికి FASTag Annual Pass ఉపయోగపడుతుంది. సాధారణంగా ప్రతి టోల్ ప్లాజా వద్ద ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ పాస్ తీసుకుంటే అర్హత ఉన్న టోల్ క్రాసింగ్‌లకు ప్రతిసారీ FASTag బ్యాలెన్స్ నుంచి డబ్బు కట్ అవ్వదు. 

ఈ పాస్ అర్హత ఉన్న నాన్ కమర్షియల్ కార్లు, జీపులు & వ్యాన్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అన్ని టోల్ ప్లాజాలు, అన్ని రకాల టోల్ వ్యవస్థలపై ఇది వర్తించదు. అందువల్ల పాస్ తీసుకునే ముందు మీ ప్రయాణ మార్గంలో ఉన్న టోల్ ప్లాజాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయో లేదో తెలుసుకోవాలి.

దీని ప్రధాన ప్రయోజనం ఖర్చులపై స్పష్టత ఉండటం. ఏడాది పొడవునా తరచూ హైవేపై ప్రయాణించే వారికి టోల్ ఛార్జీలు భారీగా పెరగవచ్చు. అలాంటి వారు ముందుగానే రూ.3,075 చెల్లించి పాస్ తీసుకోవడం ద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

ఉదాహరణకు, మీరు ఒక్కోసారి రూ.100 టోల్ ఛార్జీ చెల్లిస్తున్నారనుకుందాం. 30 క్రాసింగ్‌లకు రూ.3,000 ఖర్చవుతుంది. 31వ క్రాసింగ్‌తో మొత్తం రూ.3,100 అవుతుంది. ఇక అక్కడి నుంచి 200 క్రాసింగ్‌ వరకు (12 నెలల గడువులోపు) మీరు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ లెక్కన రూ.3,075 Annual Pass కొంత చౌకగా ఉంటుంది. అయితే, 12 నెలల గడువు పూర్తి కాకుండానే 200 క్రాసింగ్‌లు ముందుగానే పూర్తయితే, ఇక అక్కడి నుంచి పాస్ ప్రయోజనం అందదు.

ఇది కూడా చదవండి: Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!

 2. Local FASTag Pass.. రోజూ టోల్ దాటేవారికి ఇది మేలేనా?

ఒకే టోల్ ప్లాజాను ప్రతిరోజూ దాటి కార్యాలయానికి వెళ్లేవారికి లేదా సమీప పట్టణానికి తరచూ ప్రయాణించేవారికి Local FASTag Pass ఉపయోగపడవచ్చు. 2026 నవంబర్ 1 నుంచి అర్హులైన వాహనదారులు ఈ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

టోల్ ప్లాజా మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధికి బయట ఉంటే ఏడాదికి రూ.1,500 చెల్లించాలి. అదే పరిధిలో ఉంటే రూ.3,000 రుసుము ఉంటుంది. అయితే ఈ పాస్ దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల వద్ద పనిచేయదు. మీరు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట ప్లాజాకు మాత్రమే వర్తిస్తుంది.

 Local Passతో ఎంత ఆదా అవుతుంది?

రూ.1,500 పాస్ తీసుకున్నవారు ఒక్కో క్రాసింగ్‌కు రూ.50 చెల్లించే పరిస్థితిలో 30 క్రాసింగ్‌ల తర్వాత ఆ మొత్తానికి సమానమైన ఖర్చు వస్తుంది. ఒక్కోసారి రూ.100 చెల్లిస్తే 15 క్రాసింగ్‌లకే రూ.1,500 అవుతుంది.

రూ.3,000 పాస్ విషయానికి వస్తే.. రూ.50 చొప్పున 60 క్రాసింగ్‌లు, రూ.100 చొప్పున 30 క్రాసింగ్‌లకు సమానమైన ఖర్చు అవుతుంది. 

ఈ లెక్కలు అంచనా మాత్రమే. పాస్ ద్వారా ఏ ప్రయాణాలు కవర్ అవుతాయో ముందుగా తెలుసుకోవాలి. మీ ప్రయాణంలో ఒకటి కంటే ఎక్కువ టోల్ ప్లాజాలు ఉంటే, మిగతా ప్లాజాల ఛార్జీలను విడిగా లెక్కించాలి. అంటే.. ఒక టోల్ ప్లాజా వద్ద Local Pass ఉన్నంత మాత్రాన మీ రోజువారీ ప్రయాణంలో చెల్లించాల్సిన అన్ని టోల్ గేట్ల ఛార్జీలు మాఫీ కావు.

 3. Regular FASTag Recharge.. అప్పుడప్పుడు ప్రయాణించేవారికి సరైనదేనా?

ఏడాదిలో కొన్ని సార్లు మాత్రమే హైవేపై ప్రయాణించే వారికి సాధారణ FASTag Recharge మంచి ఆప్షన్. ఇందులో వార్షిక రుసుము ఉండదు. మీ FASTag ఖాతాలో డబ్బులు జమ చేసుకుంటే, టోల్ ప్లాజా దాటినప్పుడు వర్తించే ఛార్జీ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీని ప్రధాన ప్రయోజనం ప్రయాణానికి తగ్గట్టుగా డబ్బు చెల్లించడం. ముందుగానే రూ.3,075 లేదా రూ.1,500 చెల్లించి పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉపయోగించిన టోల్ సేవలకు మాత్రమే డబ్బు ఖర్చవుతుంది.

ఉదాహరణకు, ఏడాది మొత్తం మీద మీ టోల్ ఖర్చు రూ.1,200 మాత్రమే అయితే రూ.3,075 Annual Pass తీసుకోవడం ఆర్థికంగా సరైన నిర్ణయం కాదు. అదే అర్హత ఉన్న హైవేలపై మీ టోల్ ఖర్చు రూ.5,000 వరకు ఉంటే Annual Pass తీసుకోవడం వల్ల ఆదా అవుతుందేమో పోల్చి చూడవచ్చు.

మీకు ఏది బెస్ట్?

అందరికీ ఒకే FASTag ఆప్షన్ సరిపోదు. అర్హత ఉన్న జాతీయ రహదారులపై తరచూ ప్రయాణిస్తూ ఏడాదికి ఎక్కువ టోల్ ఛార్జీలు చెల్లించే వారికి రూ.3,075 Annual Pass ఉపయోగపడవచ్చు. ఒకే టోల్ ప్లాజాను తరచూ దాటే అర్హులైన స్థానిక వాహనదారులకు Local Pass మంచి ఎంపిక కావచ్చు. అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణించేవారికి Regular FASTag Recharge సరళమైన & తక్కువ ఖర్చుతో కూడిన మార్గం.

కాబట్టి కేవలం పాస్ ధరను చూసి నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఏ రహదారులపై ప్రయాణిస్తున్నారు? ఎన్ని టోల్ ప్లాజాలు దాటుతున్నారు? ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆ ప్రయాణాలు పాస్ పరిధిలోకి వస్తున్నాయా? అనే అంశాలను పరిశీలించి సరైన ఆప్షన్ ఎంచుకోండి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic E-Challans: ఈ-చలాన్లతో ఇబ్బంది పడుతున్నారా? నేషనల్‌ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు.. ఇలా చేయండి
ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? లోక్‌ అదాలత్‌ ద్వారా జరిమానా తగ్గించుకునే ఛాన్స్‌!
New Driving Licence Rules: స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తున్నారా? రెడ్ సిగ్నల్ దాటుతున్నారా? 5-స్ట్రైక్‌ రూల్‌తో మీ డ్రైవింగ్‌ లెసెన్స్‌ రద్దు!
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం లేదా? '5-స్ట్రైక్‌' రూల్‌ గురించి తెలీకే మీరా పని చేస్తున్నారు!
Diwali Car Offers 2026: రూ.90,000 వరకు డిస్కౌంట్లు.. Tata Nexon, Nissan Magnite సహా 10 SUVలపై అదిరిపోయే ఆఫర్లు
బడ్జెట్‌ కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. Skoda Kylaq నుంచి Maruti Fronx వరకు భారీ డిస్కౌంట్లు!
రూ.16.99 లక్షలు పెట్టి Renault Duster Hybrid కొనడం మంచిదేనా? మైలేజీ, ఫీచర్లు, బూట్ స్పేస్‌పై పూర్తి విశ్లేషణ
రెనాల్ట్‌ డస్టర్‌ హైబ్రిడ్‌ కొనాలా, వద్దా? - 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
శుక్రుడు ఉదయించాడు: అక్టోబర్ 30 నుంచి ఈ 5 రాశులవారికి స్వర్ణయుగం!
Gill Temple Gadget: నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
నుదిటిపై వింత పరికరంతో ప్రాక్టీస్ చేసిన శుభ్‌మన్ గిల్.. జొమాటో సీఈవో కొత్త హెల్త్ వేరబుల్ చూసి కెప్టెన్ ఫిదా, వైరల్ అవుతున్న క్రేజీ ఫీచర్లు
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Embed widget