అన్వేషించండి

Tata Nexon నుంచి Hyundai Creta వరకు.. పానోరమిక్ సన్‌రూఫ్ ఉన్న 10 కార్లు, మీ బడ్జెట్‌లోనే కొనొచ్చు!

భారత్‌లో పానోరమిక్‌ సన్‌రూఫ్‌తో లభించే 10 చవకైన పెట్రోల్, డీజిల్, CNG కార్ల వివరాలు. Tata Nexon, Mahindra XUV 3XO, Kia Syros ధరలు, ఇంజిన్ వివరాలు తెలుసుకోండి.

10 Budget cars with panoramic sunroof: భారత్‌లో కారు కొనేవారు ఇప్పుడు ఇంజిన్, మైలేజీ, భద్రతతో పాటు ఆధునిక ఫీచర్లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా పానోరమిక్‌ సన్‌రూఫ్ ఉన్న కార్లపై ఆసక్తి పెరిగింది. సాధారణ సన్‌రూఫ్‌తో పోలిస్తే ఇందులో పైకప్పు ఇంకాస్త ఎక్కువ విస్తీర్ణంలో తెరుచుకుంటుంది. ఇందులో నిలబడితే గాల్లో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. క్యాబిన్‌లోకి సహజ కాంతి ఎక్కువగా రావడంతో లోపలి భాగం విశాలంగానూ కనిపిస్తుంది. గతంలో ఖరీదైన కార్లకే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే మోడళ్లలోనూ లభిస్తోంది. భారత్‌లో పానోరమిక్‌ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్న, మీ బడ్జెట్‌లో వచ్చే పెట్రోల్, డీజిల్, CNG కార్ల వివరాలు ఇవీ:

 10. మారుతి సుజుకి గ్రాండ్ విటారా   

మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో Zeta (O) వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. Zeta+ (O), Alpha (O), Alpha+ (O) వేరియంట్లలోనూ ఈ ఫీచర్ ఉంటుంది. ధరలు రూ.13.89 లక్షల నుంచి రూ.19.62 లక్షల వరకు ఉన్నాయి.

 9. మారుతి సుజుకి విక్టోరిస్

మారుతి సుజుకి విక్టోరిస్‌లో ZXi (O), ZXi+ (O) వేరియంట్ల నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ.13.69 లక్షల నుంచి రూ.19.99 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 

 8. నిస్సాన్ టెక్టన్

నిస్సాన్ టెక్టన్‌లో N-Connecta వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ ఫీచర్ ఉన్న వేరియంట్ల ధరలు రూ.13.69 లక్షల నుంచి రూ.16.49 లక్షల వరకు ఉన్నాయి.

 7. హ్యుందాయ్ బేయాన్

హ్యుందాయ్ బేయాన్‌లో HX6, HX8, HX10 వేరియంట్లలో పానోరమిక్‌ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ల ధరలు రూ.13.57 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉన్నాయి.

 6. హ్యుందాయ్ క్రెటా

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. ఇందులో EX (O) వేరియంట్ నుంచే పానోరమిక్‌ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ధరలు రూ.13.14 లక్షల నుంచి రూ.19.91 లక్షల వరకు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 

 5. రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ డస్టర్‌లో Adventure వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ లభిస్తుంది. ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ.19.49 లక్షల వరకు ఉన్నాయి. 

 4. టాటా కర్వ్

టాటా కర్వ్‌లో Creative X+ వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ధరలు రూ.12.91 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఉన్నాయి.

 3. కియా సైరోస్

కియా సైరోస్‌లో HTK+ వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఉన్న వేరియంట్ల ధరలు రూ.10.76 లక్షల నుంచి రూ.15.82 లక్షల వరకు ఉన్నాయి.

 2. మహీంద్రా XUV 3XO

మహీంద్రా XUV 3XOలో RevX Edge (O) వేరియంట్ నుంచి పానోరమిక్‌ సన్‌రూఫ్ లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ.9.89 లక్షల నుంచి రూ.15.04 లక్షల వరకు ఉన్నాయి.

 1. టాటా నెక్సాన్

భారత్‌లో పానోరమిక్‌ సన్‌రూఫ్ ఉన్న అత్యంత చవకైన కారుగా టాటా నెక్సాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. Pure+ PS వేరియంట్‌లోనే ఈ ఫీచర్ లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.9.72 లక్షలు. Creative+ PS, Fearless+ PS వంటి అధిక వేరియంట్లలోనూ పానోరమిక్‌ సన్‌రూఫ్ ఉంటుంది. వేరియంట్‌ను బట్టి నెక్సాన్ ధరలు గరిష్ఠంగా రూ.14.22 లక్షల వరకు ఉన్నాయి.

భారత్‌లో రూ.10 లక్షలలోపు ధరలో పానోరమిక్‌ సన్‌రూఫ్‌ ఇచ్చే రెండు మోడళ్లలో నెక్సాన్ ఒకటి. మరో మోడల్ మహీంద్రా XUV 3XO.

 ఏ కారు ఎంచుకోవాలి?

పానోరమిక్‌ సన్‌రూఫ్‌ను తక్కువ ధరలో పొందాలనుకునేవారికి టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO మంచి ప్రారంభ ఎంపికలు. కొంచెం ఎక్కువ క్యాబిన్ స్థలం, ఇతర సౌకర్యాలు కోరుకునేవారు కియా సైరోస్‌ను పరిశీలించవచ్చు. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, విక్టోరిస్ వంటి మోడళ్లు అధిక ధరల శ్రేణిలో ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి.

పైన చెప్పిన రేట్లన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు. రిజిస్ట్రేషన్, బీమా, ఇతర ఛార్జీలు కలిపిన తర్వాత ఆన్-రోడ్ ధర పెరుగుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Embed widget